AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తీరనున్న ట్రాపిక్ సమస్య.. అరగంట జర్నీ 5 నిమిషాల్లోనే..!

Hyderabad News: నగరంలో ట్రాఫిక్ నిత్య నరకం. గూగుల్ మ్యాప్‌లో ఏ రూట్ చెక్ చేసినా రెడ్ మార్క్ కనిపించేంత రద్దీ రోడ్లు హైదరాబాద్‌ వి. అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేలా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద 30 వేల కోట్ల రూపాయలతో పలు పై వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించింది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల దూరంలో 5 జంక్షన్లతో..

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తీరనున్న ట్రాపిక్ సమస్య.. అరగంట జర్నీ 5 నిమిషాల్లోనే..!
Indira Park To Vst Steel Bridge
Vidyasagar Gunti
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 16, 2023 | 9:57 AM

Share

నగరంలో బండి ఎక్కి చూడు.. ట్రాఫిక్ ఫికర్ చూడు అన్నట్లు తయారవుతోంది రోడ్ల పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిత్యం రద్దీతో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఫ్లై ఓవర్ల నిర్మాణాలతో ట్రాఫిక్ కష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. SRDP కింద నగరంలో సిగ్నల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా చేపట్టిన 32 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా.. నగర కిర్తీకిరిటంలో మరో కలికితురాయి లాంటి స్పెషల్ ఫ్లై ఓవర్ రెడీ అయింది. ఇంతకీ ఎంటా స్పెషల్ ఫ్లై ఓవర్.. ఎక్కడుంది.. ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది..? కీలక వివరాలపై మీరూ ఓ లుక్కేసుకోండి..

నగరంలో ట్రాఫిక్ నిత్య నరకం. గూగుల్ మ్యాప్‌లో ఏ రూట్ చెక్ చేసినా రెడ్ మార్క్ కనిపించేంత రద్దీ రోడ్లు హైదరాబాద్‌ వి. అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేలా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద 30 వేల కోట్ల రూపాయలతో పలు పై వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించింది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.

లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల దూరంలో 5 జంక్షన్లతో ఎవరైన ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాటి విద్యానగర్ వైపు వెళ్లాలంటే అరగంట టైం పడుతుంది. ఆ దూరాన్ని మరింత చేరువచేసేలా జంక్షన్లు జామ్ కాకుండా వాటిపై నుంచి దక్షిణ భారతంలోనే అతిపొడవైన 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. నిత్యం రద్దీ ఉండే ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియోటర్ల జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకు ఈ స్టీల్ వంతెనతో ట్రాఫిక్ సమస్య తీరనుంది.

ఇరుకైన ఈ రోడ్డుమార్గంలో కాంక్రీట్ ఫ్లై ఓవర్ కంటే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మేలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. 2020 జులై 10న శంకుస్థాపన జరిగినా 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్లలో పూర్తైన స్టీల్ బ్రిడ్జి 4 లైన్ల రోడ్ తో ఏర్పాటు చేశారు. 450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12,500 మెట్రిక్ టన్నుల ఇనుముతో దీన్ని నిర్మించారు. సన్నటి ఐరన్ పిల్లరు 81 ఉంటే 426 దూలాలు నిర్మించినట్లు ఇంజనీర్లు తెలిపారు. నగరంలో మరో మైలురాయిగా నిలిచే ప్లై ఓవర్ తమ నియోజకవర్గంలో రావడంపై స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ యువజన నాయకులు ముఠా జైసింహా సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మార్గంలో రోజూ లక్ష వాహనాలు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. వాహనాల డెన్సిటీ ఎక్కువ ఉండటంతో పాటు జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ టెన్షన్ షరామాములే ఇక్కడ. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోమీటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంటే అరగంట జర్నీలో 25 నిమిషాల సమయం ఆదా అవుతుంది. దీనిపై వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పై నుంచి మెట్రో లైన్ ఉంది. కానీ ఇక్కడ మెట్రో రైలు పై నుంచి ఈ బ్రిడ్జి నిర్మించారు. మెట్రో లైన్ పై నుంచి వెళుతున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై తక్కువ టైంలో పూర్తి చేయొచ్చు. అలాగే మన్నిక కూడా దాదాపు వందేళ్ల పై మాటే అంటున్నారు ఇంజనీర్లు. ఆగస్టు 19 న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..