Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: అన్నలు ఒక పార్టీ.. తమ్ముళ్లు మరో పార్టీ.. మరింత రంజుగా మారనున్న తెలంగాణ ఎన్నికలు..

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల వేళ కొందరు నేతలకు ఇంటిపోరు తప్పడం లేదు. కొన్నిచోట్ల రాజకీయాలు అన్నదమ్ములను విడగొడుతుంటే.. మరికొన్ని చోట్ల పొలిటికల్ బ్రదర్స్ విడిపడి తెలివిగా పనిచేసుకుంటున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అన్నలు ఒక పార్టీలో ఉంటే.. తమ్ముళ్లంతా ఉనికి కోసం మరో పార్టీలో పోరాడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పాలిటిక్స్ అంతుచిక్కడం లేదు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో..

Telangana Elections: అన్నలు ఒక పార్టీ.. తమ్ముళ్లు మరో పార్టీ.. మరింత రంజుగా మారనున్న తెలంగాణ ఎన్నికలు..
Telangana Politics
Follow us
TV9 Telugu

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 16, 2023 | 11:10 AM

వాళ్లు సొంత అన్నదమ్ముళ్లే.. రాజకీయాల్లో మాత్రం ఎవరిదారి వారిదే. అన్న ఒక పార్టీ కండువా కప్పుకుంటే.. తమ్ముడు మరో పార్టీకి జై అంటున్నారు.. కాన్సెప్ట్ ఎదైనా.. వాళ్ల టార్గెట్ మాత్రం ఇంట్లో పవర్ ఉండాల్సిందేనా.. పరస్పరం ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న ఆ అన్నదమ్ముళ్లు ఎన్నికల్లో నేరుగా తలబడతారా? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారా? తెలంగాణలో నడుస్తున్న ఇంట్రస్టింగ్ పొలిటికల్ ఇష్యూస్ మీకోసం..

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల వేళ కొందరు నేతలకు ఇంటిపోరు తప్పడం లేదు. కొన్నిచోట్ల రాజకీయాలు అన్నదమ్ములను విడగొడుతుంటే.. మరికొన్ని చోట్ల పొలిటికల్ బ్రదర్స్ విడిపడి తెలివిగా పనిచేసుకుంటున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అన్నలు ఒక పార్టీలో ఉంటే.. తమ్ముళ్లంతా ఉనికి కోసం మరో పార్టీలో పోరాడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పాలిటిక్స్ అంతుచిక్కడం లేదు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెనర్ గా కొనసాగుతున్నారు. ఆయన సోదరుడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం దాదాపు కన్ఫర్మ్ కావడంతో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేస్తారా? ఇంకా వేరే ఏదైనా ఆప్షన్ తీసుకుంటారా? అనేది చూడాలి. అన్న కాంగ్రెస్ లో.. తమ్ముడు బీజేపీలో కొనసాగడంతో నల్లగొండ పాలిటిక్స్‌లో ఎవరిది పై చేయి అన్నది ఆసక్తిరేపుతోంది.

గడ్డం బ్రదర్స్..

గడ్డం బ్రదర్స్‌ది అదే పరిస్థితి. గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఇద్దరు సోదరులు పాలిటిక్స్‌లో ఉన్నారు. 2004 వైఎస్ఆర్ హాయంలో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కార్మికమంత్రిగా గడ్డం వినోద్ పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పొందారు. పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్‌లో పనిచేసి.. చివరకు కాషాయ పార్టీ గూటికి చేరుకున్నారు. అన్న వినోద్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ్ముడు వివేక్ మాత్రం ఎక్కడ నుంచి పోటీ చేయాలనేదానిపై తటపటాయిస్తున్నారు.

ఎర్రబెల్లి బ్రదర్స్..

బీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌కు బ్రదర్ పోటు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు కీలకంగా వ్యహరిస్తున్నారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. ఇటీవల బీజేపీలో చేరారు. అన్న ఎర్రబెల్లి యాదకర్ రావు నీడలో కాకుండా.. సొంతంగా తన మార్క్ రాజకీయాలు ఉండాలని ప్రదీప్ రావు భావిస్తున్నారు. వరంగల్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏదో నియోజకవర్గంలో పోటీచేసి తన ఉనికి చాటుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ధర్మపురి బ్రదర్స్..

నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి శ్రీనివాస్ తనయులిద్దరు చేరోపార్టీలో కొనసాగుతున్నారు. ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి గిట్టని ధర్మపురి బ్రదర్స్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. వారిద్దరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె సోదరుడు చిట్టెపు రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కాతమ్ముళ్లిద్దరి మధ్యవిబేధాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో డీకే అరుణ.. తన తమ్ముడిపై తానే నిలబడతారా? పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఖమ్మం జిల్లాలో సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా అన్నదమ్ములే. సుధాకర్ రెడ్డి బిజెపిలో చాలా కీలకమైన పొజిషన్లో ఉండడం శ్రీనివాస్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడంతో ఇప్పుడు అక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు రెండు పార్టీలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది.

రాజకీయాల్లో అధికార సంబంధాలకే ప్రాధాన్యతనిస్తారా? రక్త సంబంధాలు చోడ్ దే అంటారా? ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అన్నదమ్ముళ్ల రాజకీయాలు ఎలా ఉంటాయో అన్నది వచ్చే ఎన్నికల్లో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..