Punjagutta NIMS: డాక్టర్‌కే టోకరా.. ఏకంగా రూ.2.58 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
కొంతకాలంగా ఓఎల్ఎక్స్ లో వస్తువులు కొంటామంటూ వస్తున్న వ్యక్తులని నమోదు అని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్న జనాలు మాత్రం పాటించడం లేదు. గతంలో అనేకసార్లు ఓఎల్ఎక్స్ లో అనేక ఐటమ్స్ విషయంలో చాలామంది మోసపోయారు. ఓఎల్ఎక్స్ విషయంలో ఎవరికీ స్కానర్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఓటీపీలు కానీ చెప్పొద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కూడా పబ్లిక్ మాత్రం మారడం లేదు. రోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో కనీసం ఇప్పటినుంచి అయినా ఎవరు కూడా..

హైదరాబాద్, ఆగస్టు 16: ఓఎల్ఎక్స్‌లో ఎలక్ట్రిక్ కుర్చీ కొంటానంటూ డాక్టర్ కి షాక్ ఇచ్చారు సైబర్ నేరగాడు. ఏకంగా లక్షల రూపాయలు కాజేసి హ్యాండ్ ఇచ్చాడు. నిమ్స్‌లో పనిచేస్తున్న ఒక వైద్యుడికి సైబర్ నేరగాళ్ల టోకరా కలకలం రేపింది. పంజాగుట్ట నిమ్స్ లో సీనియర్ రెసిడెంట్‌గా పని చేస్తున్న వైద్యుడు ఓఎల్ఎక్స్ ఎలక్ట్రిక్ కుర్చీ అమ్మకానికి పెట్టాడు. అంతే జితేంద్ర శర్మ పేరుతో వైద్యుడికి ఫోన్ వచ్చింది. తనను తాను జితేంద్ర శర్మ పేరుతో పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు తనకు కూకట్‌పల్లిలో ఫర్నిచర్ దుకాణం ఉందని నమ్మబలికాడు. అనంతరం కుర్చీ కొనుగోలు చేస్తా అని చెప్పి డబ్బు పంపేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పాడు. నమ్మిన వైద్యుడు అలాగే చేశాడు. దీంతో వైద్యుడి ఖాతా నుంచి రూ.2.58 లక్షలు సైబర్ నేరగాడు కొట్టేశాడు. మోసపోయానని గ్రహించిన వైద్యుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Olx లో నకిలీ గాల్లు
కొంతకాలంగా ఓఎల్ఎక్స్ లో వస్తువులు కొంటామంటూ వస్తున్న వ్యక్తులని నమోదు అని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్న జనాలు మాత్రం పాటించడం లేదు. గతంలో అనేకసార్లు ఓఎల్ఎక్స్ లో అనేక ఐటమ్స్ విషయంలో చాలామంది మోసపోయారు. ఓఎల్ఎక్స్ విషయంలో ఎవరికీ స్కానర్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఓటీపీలు కానీ చెప్పొద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కూడా పబ్లిక్ మాత్రం మారడం లేదు. రోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో కనీసం ఇప్పటినుంచి అయినా ఎవరు కూడా ఓఎల్ఎక్స్ లో నమోదంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజాగా పోలీసులు చెబుతుందని ప్రకారం సైబర్ నేరాల్లో అత్యధికంగా మోసానికి గురవుతున్న వారు చదువుకున్న వారే కావడం గమనార్హం. పోలీసులు మీడియా పదేపదే సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నప్పటికీ వైద్యుల లాంటి చదువు చదివిన ఉన్నత విద్యావంతుల సైతం సైబర్ నేరగాల చేతిలో మోసపోవడం కల కలం రేపుతుంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
