Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇక బ్రతకదనే అకున్నారంతా.. అంతలోనే అవయవదానం చేసి అర్థాంగికి ప్రాణం పోశాడు

హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపులో నొప్పితో పాటు కామెర్లు ఉండి నెల కిందట ఫిట్స్‌ రావడంతో బెడ్‌కే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కోమాలోకి వెళ్లిన తీరుతో ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారం మించి బతకదని చెప్పినట్లు, దాంతో వారు లక్డీకపూల్ లోని గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకోచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి లోని వైద్యుల బృందం నేతృత్వంలో రోగిని పరిశీలించగా క్రోనిక్‌ లివర్‌ ఫెయిల్యూర్‌గా గుర్తించారు. అనంతరం ఎవరైనా దాతలు లివర్‌ ఇస్తే..

Hyderabad: ఇక బ్రతకదనే అకున్నారంతా.. అంతలోనే అవయవదానం చేసి అర్థాంగికి ప్రాణం పోశాడు
Afrin Sultana, Mohammed Liaquat
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Srilakshmi C

Updated on: Aug 16, 2023 | 11:11 AM

హైదరాబాద్‌, ఆగస్టు 16: వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకదన్న ఓ మహిళకు.. కట్టుకున్న భర్తే కాలేయం దానం చేసి కాపాడుకున్నాడు. పొత్తి కడుపులో నొప్పితో ఐదేళ్లుగా బాధపడుతున్న 39 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఓ ఆసుపత్రిలో భర్త లివర్ దానంచేసి ప్రాణం పోసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపులో నొప్పితో పాటు కామెర్లు ఉండి నెల కిందట ఫిట్స్‌ రావడంతో బెడ్‌కే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కోమాలోకి వెళ్లిన తీరుతో ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారం మించి బతకదని చెప్పినట్లు, దాంతో వారు లక్డీకపూల్ లోని గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకోచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి లోని వైద్యుల బృందం నేతృత్వంలో రోగిని పరిశీలించగా క్రోనిక్‌ లివర్‌ ఫెయిల్యూర్‌గా గుర్తించారు. అనంతరం ఎవరైనా దాతలు లివర్‌ ఇస్తే ఆమె బ్రతుకుతుందని వైద్యులు తెలిపారు. దీంతో భర్త మహమ్మద్ లియాఖత్ లివర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అనంతరం కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిందని వెల్లడించారు. పడకకు పరిమితం అయిన ఆమె పది రోజుల్లో కోలుకుని నడవడం ప్రారంభించారని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో పాటు తన పనులు తాను చేసుకునే స్థితికి చేరిందని తెలిపారు. లివర్ దాతలకు ఆరు వారాల్లో రికవరీ అవుతుందని కుటుంబంలో ఎవ్వరికైనా లివర్ ఇవ్వాల్సి వస్తె ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావాలని వైద్యులు కోరారు. బ్లెడ్ గ్రూప్ కలిస్తేనే దానం చేయడానికి వీలవుతుందని వివరించారు. తాను బ్రతుకుతానని అనుకోలేదని తన భర్త ధైర్యంగా ముందుకు వచ్చి కాలేయం ఇచ్చేందుకు ముందుకు రావడంతో వైద్యుల కృషి వల్ల తాను ప్రాణాలతో బతికే బయటపడ్డానని ఆప్రిన్ సుల్తానా తెలిపింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తన భార్యను కాపాడినందుకు వైద్యులకు కన్నీరు తో భర్త మహమ్మద్ లియాఖాత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
నదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్‌!
నదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్‌!
తెల్లారి స్కూల్ గదిలో కనిపించిన వింత జంతువు.. ఏంటని చూడగా
తెల్లారి స్కూల్ గదిలో కనిపించిన వింత జంతువు.. ఏంటని చూడగా
AP: ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
AP: ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు...
Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు...
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశా
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశా
చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
ఏం పిల్లరా బాబు.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది..!
ఏం పిల్లరా బాబు.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది..!
శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న ప్లేయర్
ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న ప్లేయర్