Ram Charan: రామ్ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ రోల్.. ఇక బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..
డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని పవర్ ఫుల్ పాత్ర కోసం మేకర్స్ సేతుపతిని ఎంపిక చేశారని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే మాత్రం బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమంటున్నారు మెగా ఫ్యాన్స్.
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగి ఇటివలే తిరిగి ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి కథానాయికలుగా నటిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తర్వాత చరణ్.. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో వర్క్ చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మెగా అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని పవర్ ఫుల్ పాత్ర కోసం మేకర్స్ సేతుపతిని ఎంపిక చేశారని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే మాత్రం బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమంటున్నారు మెగా ఫ్యాన్స్.
రామ్ చరణ్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి.. ఇప్పుడు విలన్ పాత్రలలోనూ అదరగొడుతున్నారు. ఇప్పటికే ఉప్పెన చిత్రంలో రాయనం పాత్రలో మెప్పించారు విజయ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
విజయ్ సేతుపతి ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన మాస్టర్ చిత్రంలోనూ సేతుపతి నటించారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలన్ పాత్రలతో రఫ్పాడించేస్తున్నాడు విజయ్. అలాగే చరణ్, బుచ్చిబాబు కాంబో సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను పాన ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు.
బుచ్చిబాబు సన ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.