Samantha: మజిలీలోని సాంగ్ వింటూ సమంత ఎమోషనల్.. వైరలవుతున్న వీడియో..

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఖుషి సినిమా మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకలో సామ్ స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సామ్ కలిసి చేసిన డాన్స్ సినీ అభిమానులను మెస్మరైజ్ చేసింది. అయితే ఈ వేడుకలో పలువురు సింగర్స్.. గతంలో సామ్ నటించిన సినిమా సాంగ్స్ ఆలపించారు. ఇక అదే సమయంలో సామ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ మజిలీ చిత్రంలోని ప్రియతమ.. ప్రియతమా.. సాంగ్ పాడుతున్న సమయంలో సామ్ భావోద్వేగానికి గురయ్యారు. సాంగ్ వింటున్న సమయంలో ఆమె తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించారు.

Samantha: మజిలీలోని సాంగ్ వింటూ సమంత ఎమోషనల్.. వైరలవుతున్న వీడియో..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 17, 2023 | 4:36 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. చికిత్స కోసం మరికొద్ది రోజుల్లో అమెరికాకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న చిత్రాలన్నింటిని కంప్లీట్ చేసింది. మరోవైపు తదుపరి ప్రాజెక్టుల కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసినట్లుగా టాక్ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి బాలి వేకేషన్ వెళ్లిన సామ్.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఖుషి సినిమా మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకలో సామ్ స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సామ్ కలిసి చేసిన డాన్స్ సినీ అభిమానులను మెస్మరైజ్ చేసింది. అయితే ఈ వేడుకలో పలువురు సింగర్స్.. గతంలో సామ్ నటించిన సినిమా సాంగ్స్ ఆలపించారు.

ఇక అదే సమయంలో సామ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ మజిలీ చిత్రంలోని ప్రియతమ.. ప్రియతమా.. సాంగ్ పాడుతున్న సమయంలో సామ్ భావోద్వేగానికి గురయ్యారు. సాంగ్ వింటున్న సమయంలో ఆమె తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మజిలీ చిత్రంలో హీరో నాగచైతన్య, సమంత జంటగా నటించారు. ఇందులో తన భర్తపై ఎనలేని ప్రేమను కలిగి ఉన్న శ్రావణి పాత్రలో నటించి మెప్పించింది సామ్.

ప్రియతమా.. ప్రియతమా సాంగ్ వింటూ సామ్ ఎమోషనల్..

ఏమాయ చేసావే సినిమాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు సామ్, చైతన్య. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2021లో విడాకులు తీసుకున్నారు. సమంత, చైతూ కలిసి నటించిన నాల్గవ చిత్రమే మజిలీ. అంతకు ముందు వీరిద్దరి కాంబోలో ఏ మాయ చేసావే, మనం, ఆటో నగర్ సూర్య చిత్రాలు వచ్చాయి.

సమంత ఇన్ స్టా పోస్ట్..

సమంత ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?