Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ రిలీజ్.. స్టూవర్టుపురం దొంగగా రవితేజ లుక్..
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ధమాకా, రావణాసుర సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ… ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీతో రాబోతున్నారు. అదే టైగర్ నాగేశ్వరరావు. 19’s కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది తెలియకుండా సస్పెన్స్ మెయింటెన్ చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు టీజర్ లో రివీల్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఆంధ్రప్రదేశ్ గోదావరి తీరాన జన్మించిన టైగర్ నాగేశ్వర రావు గజదొంగగా దేశాన్ని ఎలా గడగడలాడించాడు అనేది ఈ టీజర్ తో చూపించారు. ఇందులోని ప్రతి షాట్.. 1970’s వాతావరణాన్ని ప్రతిబింబించేలా కనిపిస్తుంది. పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్.. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం స్టార్ట్ చేశాడు అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని కనిపిస్తున్నాయి. అలాగే ఇందులో మరోసారి రవితేజ యాక్షన్ తో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.
రవితేజ ట్వీట్..
The Invasion begins now & The hunt begins on October 20th 🙂
Here’s the Teaser of #TigerNageswaraRao 🥷🏾🐅https://t.co/1MTwH9q5tv@DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @NupurSanon @gaya3bh @madhie1 pic.twitter.com/MJNA5ZFe8a
— Ravi Teja (@RaviTeja_offl) August 17, 2023
రవితేజ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రేణూ దేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.