Allu Arjun: అద్భుత ప్రపంచం ‘అల్లు గార్డెన్స్’.. చూపు తిప్పుకోనివ్వని సౌందర్యం.. అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉందో చూశారా ?..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల తన తండ్రి అల్లు అరవింద్ కుటుంబంతోనే అల్లు అర్జున్ కలిసి ఉంటారు. ఇటీవల అల్లు అరవింద్ తన నివాసంలోనే సూపర్ హిట్ చిత్రం బేబీ మూవీ టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం అద్భుతమైన అల్లు గార్డెన్స్ లోనే జరిగింది. ఇవే కాకుండా.. ఫ్యామిలీ ఫంక్షన్స్, కుటుంబంతో సమయం కేటాయించినప్పుడు అల్లు గార్డెన్స్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి.

Allu Arjun: అద్భుత ప్రపంచం 'అల్లు గార్డెన్స్'.. చూపు తిప్పుకోనివ్వని సౌందర్యం.. అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉందో చూశారా ?..
Allu Arun Family
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 17, 2023 | 3:54 PM

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ క్రేజ్ మారిపోయింది. ఇక ఇప్పుడు సౌత్ టూ నార్త్ సినీ ప్రియులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమా పై మరింత క్యూరియాసిటీని పెంచడమేకాదు.. మరోసారి బన్నీ ఖాతాలో మరో రికార్డ్ పడేట్టుగానే కనిపిస్తోంది. ఓవైపు ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త సమయం దొరికితే తన కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతారు. తన కూతురు అర్హ, కుమారుడు అయాన్‏తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. వీరి ముగ్గురికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే బన్నీ హౌస్.. గార్డెన్ లుక్స్ నెటిజన్లను ఆకర్షించాయి. ముఖ్యంగా అల్లు గార్డెన్స్.. ఎంతో సింపుల్ గా .. అందగా.. ప్రకృతికి ప్రతిబింబింగా కనిపిస్తుంది. నేచర్ లవర్స్ అయితే అల్లు అర్జున్ ఇంటిని ప్రకృతి మాయ ప్రపంచం అనడం మాత్రం. అంత అందంగా.. ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల తన తండ్రి అల్లు అరవింద్ కుటుంబంతోనే అల్లు అర్జున్ కలిసి ఉంటారు. ఇటీవల అల్లు అరవింద్ తన నివాసంలోనే సూపర్ హిట్ చిత్రం బేబీ మూవీ టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం అద్భుతమైన అల్లు గార్డెన్స్ లోనే జరిగింది. ఇవే కాకుండా.. ఫ్యామిలీ ఫంక్షన్స్, కుటుంబంతో సమయం కేటాయించినప్పుడు అల్లు గార్డెన్స్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి.

అల్లు అర్జున్ హౌస్ వీడియో…

View this post on Instagram

A post shared by Geetha Arts (@geethaarts)

బేబీ మూవీ టీం పార్టీ ఫోటోస్..

View this post on Instagram

A post shared by Geetha Arts (@geethaarts)

అల్లు గార్డెన్స్ లో సీటింగ్ ప్రాంతాలు, సౌకర్యవంతమైన సోఫాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఉన్నాయి.

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా పోస్ట్..

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా పోస్ట్..

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా పోస్ట్..

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా పోస్ట్..

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.