Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..

2011లో నువ్విలా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ . ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన విజయ్.. 2016లో విడుదలైన 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ కెరీర్‌ని ఒక్కసారిగా మార్చేసింది. తర్వాత రష్మిక, విజయ్ జంటగా నటించిన 'గీత గోవిందం' సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. దీంతో విజయ్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 17, 2023 | 10:50 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటు సినిమాలతోనే కాకుండా అటు వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్ పారితోషికం.. ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విజయ్ ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారనేది ఇప్పుడు తెలుసుకుందామా

2011లో నువ్విలా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ . ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన విజయ్.. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ కెరీర్‌ని ఒక్కసారిగా మార్చేసింది. తర్వాత రష్మిక, విజయ్ జంటగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. దీంతో విజయ్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..

2020లో విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక గతేడాది విడుదలైన ‘లైగర్’ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్ని ఖుషి సినిమాపైనే ఉన్నాయి. విజయ్ ఒక్కో సినిమాకి 12 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ‘లైగర్’ సినిమాకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువే తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయించాడు.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..

విజయ్ దేవరకొండ నికర విలువ రూ.65 కోట్లు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఎన్నో బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు. అలాగే విజయ్ దేవరకొండ వద్ద మంచి కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. ఫోర్డ్ మస్టాంగ్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 520, బెంజ్ జిఎల్‌ఎస్ 350, ఆడి క్యూ7 కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఇవే కాకుండా.. విజయ్ దేవరకొండకు సొంతంగా మల్టీప్లెక్స్ ఉంది. హైదరాబాద్ సమీపంలో AVD సినిమాస్ మల్టీప్లేక్స్ ఉంది. ఏవీడీ అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ. అతను ఏషియన్ సినిమాస్‌తో కలిసి పనిచేశాడు.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?