Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు ఓ ఇంటి వాడైన యంగ్‌ హీరో.. నెట్టింట వైరల్‌ అవుతోన్న పెళ్లి ఫొటోలు

కెవిన్‌ 'కనా కానమ్‌ కలలాంగల్‌' అనే తమిళ టీవీ సీరియల్‌లో తొలిసారి నటించాడు. ఈ సీరియల్‌లో కవిన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శరవణన్‌ మీనాక్షి, తాయుమానవన్‌ వంటి సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. 2017లో విడుదలైన'శత్రియాన్‌' మువీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలో నటించాడు. తన తర్వాత సినిమా 'నాట్పున్న ఎన్ననాను తెరియుమా' చిత్రంతో మొదటిసారి హీరోగా మారాడు. ఈ ఏడాది విడుదలైన 'దాదా' మువీతో సూపర్‌ హిట్‌..

ఎట్టకేలకు ఓ ఇంటి వాడైన యంగ్‌ హీరో.. నెట్టింట వైరల్‌ అవుతోన్న పెళ్లి ఫొటోలు
Hero Kavin And Monicka David
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 20, 2023 | 2:42 PM

ప్రముఖ కోలీవుడ్‌ యంగ్‌ హీరో కెవిన్‌ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కవిన్‌ లేటెస్ట్ మువీ ‘దాదా’ చిత్రంతో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్న కవిన్‌ తన ప్రేయసి మోనిక డేవిడ్‌ను ఆదివారం (ఆగస్టు 20) ఉదయం వివాహమాడాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రేయసి మోనిక డేవిడ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు కవిన్‌ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశాడు. ఇక కవిన్‌ ఫ్యాన్స్‌తోపాటు, పలువురు సెలబ్రెటీలు నూతన దంపతులకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీరి పెళ్లి వేడుకకు నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ సహా తదితర తారలు హాజరై సందడి చేసినట్లు తెలుస్తోంది. కాగా కెవిన్‌ ‘కనా కానమ్‌ కలలాంగల్‌’ అనే తమిళ టీవీ సీరియల్‌లో తొలిసారి నటించాడు.

ఇవి కూడా చదవండి

హీరో కవిన్ పెళ్లి వీడియో..

ఈ సీరియల్‌లో కవిన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శరవణన్‌ మీనాక్షి, తాయుమానవన్‌ వంటి సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. 2017లో విడుదలైన’శత్రియాన్‌’ మువీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలో నటించాడు. తన తర్వాత సినిమా ‘నాట్పున్న ఎన్ననాను తెరియుమా’ చిత్రంతో మొదటిసారి హీరోగా మారాడు. ఈ ఏడాది విడుదలైన ‘దాదా’ మువీతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు.

కవిన్ పెళ్లి ఫొటోలు..

View this post on Instagram

A post shared by Kavin M (@kavin.0431)

ఇక సినిమాలు, సీరియల్స్‌తోపాటు తమిళ బిగ్‌బాస్‌ 3వ సీజన్‌లోనూ కవిన్‌ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్‌ సమయంలోనే తోటి కంటెస్టెంట్‌ లాస్లియాతో లవ్‌లో పడటం, తాము సీరియస్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు లాస్లియా కూడా ధృవీకరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే వీరి ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. కొన్నాళ్లకే వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. ప్రస్తుతం మరో తమిళ మువీలో నటిస్తున్నాడు. ఇక కెవిన్‌ భార్య మోనికా గురించి చెప్పాలంటే.. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోన్న మోనికా, కెవిన్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉండగా తాజాగా వివాహ బంధంలో అడుగుపెట్టారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.