Samantha: ‘పరిమితులు.. ఆవిష్కరణలతో కొత్త ప్రేమ దొరికింది’.. సమంత ఇన్ స్టా పోస్ట్ వైరల్..

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హెల్త్ అప్డేట్స్.. మూవీకి సంబంధించిన విషయాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా సామ్.. రిలేషన్ షిప్, లవ్ కు సంబంధించిన మోటివేషనల్ కోట్స్ ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ప్రేమలో పడిందా ?అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ప్రేమ దొరికిందంటూ తన ఇన్ స్టా స్టోరీలో వెల్లడించింది.

Samantha: 'పరిమితులు.. ఆవిష్కరణలతో కొత్త ప్రేమ దొరికింది'.. సమంత ఇన్ స్టా పోస్ట్ వైరల్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 20, 2023 | 3:14 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత… తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కథలో బలం..హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా రాణిస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వుతో వాటిని జయిస్తూ.. కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఓవైపు మయోసైటిస్ సమస్యతో ఇబ్బందిపడుతున్న సామ్.. త్వరలోనే అమెరికాలో చికిత్స తీసుకోనుంది. ఇప్పటికే తన తల్లిదండ్రులతో కలిసి యూఎస్ వెళ్లారు సామ్. ఇందుకోసం ఆమె దాదాపు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండనుంది. ప్రస్తుతం సామ్ చికిత్స కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హెల్త్ అప్డేట్స్.. మూవీకి సంబంధించిన విషయాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా సామ్.. రిలేషన్ షిప్, లవ్ కు సంబంధించిన మోటివేషనల్ కోట్స్ ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ప్రేమలో పడిందా ?అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ప్రేమ దొరికిందంటూ తన ఇన్ స్టా స్టోరీలో వెల్లడించింది.

ప్రస్తుతం సామ్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యే సామ్.. తాజాగా న్యూ ఫౌండ్ లవ్ అంటూ ఓ పోస్ట్ చేశారు. అందులో వాటర్ గ్లాస్ పట్టుకున్న తన చేతి పిక్ షేర్ చేస్తూ.. “మెరిసే నీటి కోసం కొత్త ప్రేమ దొరికింది. కొత్త పరిమితులు.. కొత్త ఆవిష్కరణలతో మెరిసే నీటి కోసం కొత్త ప్రేమ దొరికింది” అంటూ రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి
Samantha's Instagram Post

Samantha’s Instagram Post

సమంత ఇన్ స్టా పోస్ట్..

ఇక సామ్ చివరిగా ఖుషి, సిటాడెల్ చిత్రాల్లో నటించింది. ఇందులో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాపై ఎంతో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.

సమంత ఇన్ స్టా పోస్ట్..

ఇక ఖుషి సినిమా కాకుండా..బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ చిత్రంలో నటించింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ చిత్రానికి రీమేక్ ఇది. ఏడాది తర్వాత సామ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు.

సమంత ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.