- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress Who Enjoying In Beach, She Is Hansika Motwani latest Photos Goes Viral
Tollywood Actress: బీచ్‌లో హొయలుపోతోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ముట్టుకుంటే కందిపోయే అందం ఈమెది..
పై ఫొటోలో బీచ్‌లో హొయలు పోతోన్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పటికే 50కు పైగా సినిమాల్లో నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే గతంలో లవ్, రిలేషన్‌షిప్ విషయాలకు సంబంధించి తరచూ వార్తల్లో నిలిచిందీ అందాల తార. అయితే గతేడాది ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని సెటిలైంది.
Updated on: Aug 20, 2023 | 1:48 PM

స్టార్ హీరోయిన్ హన్సిక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజిబిజీగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత వరుసగా విదేశీ టూర్లకు చెక్కేస్తోన్న ఈ అందాల తార తన వెకేషన్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది.

హన్సిక మోత్వాని 2022లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె తన చిరకాల మిత్రుడు సోహైల్ కతురియాను వివాహం చేసుకుని సంతోషంగా ఉంది. అప్పటి నుంచి వెకేషన్‌లోనే ఎక్కువగా ఉంటోందీ అందాల తార.

తన భర్తతో ఎక్కువ సేపు గడిపేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది హన్సిక. అందుకే పలు దేశాలు చుట్టేస్తూ హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్‌మీడియాలోనూ షేర్ చేసుకుంటోంది.

హన్సిక మోత్వాని ప్రస్తుతం టర్కీలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి అందమైన బీచులు, దర్శనీయ ప్రదేశాలను చుట్టేస్తోంది. అదే సమయంలో తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియోలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

అలా టర్కీ టూర్‌కు సంబంధించి హన్సిక షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హన్షిక. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటిస్తోంది.





























