AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్ధుల హాస్టల్‌ గదుల్లో భారీగా మారణాయుధాలు.. బాంబులు, తుపాకులతో హల్‌చల్‌!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన ఓ బాలుర హాస్టల్‌లో ఇద్దరు బాలురు మధ్య గొడవ చోటుచేసుకుంది. అదికాస్తా తీవ్ర రూపం దాల్చి తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఎక్కడ నుంచి తెచ్చారో తెలియదు గానీ బాలుర హాస్టల్‌ గదుల్లో బారీగా బాంబులు, పిస్టళ్లు చేరాయి. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌లో తనఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ గదిలో రెండు పిస్టల్స్‌, 30 లైవ్‌ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం అర్థరాత్రి తనఖీల్లో మరణాయుధాలు స్వాధీనం..

విద్యార్ధుల హాస్టల్‌ గదుల్లో భారీగా మారణాయుధాలు.. బాంబులు, తుపాకులతో హల్‌చల్‌!
Prayagraj Boys Hostel
Srilakshmi C
|

Updated on: Aug 20, 2023 | 5:17 PM

Share

లక్నో, ఆగస్టు 20: ఇద్దరు విద్యార్ధుల మధ్య చలరేగిన వివాదం చిరిగిచిరిగి గాలివానగా మారింది. దీంతో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు చేరాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా తుపాకులు, బాంబ్‌లు లభించాయి. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో శనివారం (ఆగస్టు 19) వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన ఓ బాలుర హాస్టల్‌లో ఇద్దరు బాలురు మధ్య గొడవ చోటుచేసుకుంది. అదికాస్తా తీవ్ర రూపం దాల్చి తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఎక్కడ నుంచి తెచ్చారో తెలియదు గానీ బాలుర హాస్టల్‌ గదుల్లో బారీగా బాంబులు, పిస్టళ్లు చేరాయి. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌లో తనఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ గదిలో రెండు పిస్టల్స్‌, 30 లైవ్‌ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం అర్థరాత్రి తనఖీల్లో మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసధికారులు మీడియాకు తెలిపారు. ఆగస్టు 18వ తేదీ పగటిపూట ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో మారణాయుధాలు తమ గదుల్లో దాచినట్లు వెల్లడించారు. ఆసిఫ్‌ ఇక్చాల్‌ అనే విద్యార్ధిపై అతని రూమ్‌మెట్‌ జలాల్‌ అక్బర్‌ దాడి చేశాడు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌ ఎలాగోలా హాస్టల్‌ నుంచి బయటపడి పోలీసులకు సమాచారం అందించాడు.

దీంతో శనివారం అర్ధరాత్రి హాస్టల్‌లోని గది నంబర్ 57పై దాడి చేశామని పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులను చూడగానే ఆ గదిలోని బాలురు బయటికి పారిపోయారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పోలీసులు రెండు పిస్టల్స్, 30 పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 మంది విద్యార్ధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు ఉమేశ్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజుపాల్‌ను ఇదే హాస్టల్‌లో పోలీసులు అరెస్ట్‌ చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.