Pet Dog: పెంపుడు కుక్క కోసం గొడవ.. భార్య పిల్లలను చంపి భర్త సూసైడ్!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని బద్‌నగర్‌లో దిలీప్ పవార్ (45) అనే వ్యక్తి భార్య గంగ (40), నలుగురు పిల్లలతో కాపురం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన దిలీప్ నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి భార్యను, ఇద్దరు పిల్లలను వారి ఇంట్లో హత్య చేశాడు. అనంతరం ఆ వ్యక్తి పదునైన కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ పెంపుడు కుక్క విషయంలో దిలీప్ తన భార్యతో గొడవ పడటం కారణంగా ఈ హత్యలు..

భోపాల్, ఆగస్టు 20: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపంలోని బద్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త చిన్న గొడవకే భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని బద్‌నగర్‌లో దిలీప్ పవార్ (45) అనే వ్యక్తి భార్య గంగ (40), నలుగురు పిల్లలతో కాపురం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన దిలీప్ నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి భార్యను, ఇద్దరు పిల్లలను వారి ఇంట్లో హత్య చేశాడు. అనంతరం ఆ వ్యక్తి పదునైన కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ పెంపుడు కుక్క విషయంలో దిలీప్ తన భార్యతో గొడవ పడటం కారణంగా ఈ హత్యలు జరిగాయి. శనివారం (ఆగస్టు 19) అర్థరాత్రి ఈ హత్యలు జరిగాయి.
అర్ధరాత్రి దాటిన తర్వాత పెంపుడు కుక్క అరుపులకు నిందితుడు దిలీప్ పవార్ తీవ్ర ఆగ్రహానికి గురై దానిని కొట్టడం ప్రారంభించాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన దిలీప్ కత్తితో కుక్కను చంపడానికి వెళ్లగా భార్య గంగ అడ్డుకుంది. దీంతో దిలీస్ భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. తల్లిని రక్షించడానికి పరుగుపరుగున వెళ్లిన వారి కుమారుడు యోగేంద్ర (14), కుమార్తె నేహా (17) ఇద్దరినీ క్షణికావేశంలో వారినీ హత్య చేశాడు. ఈ క్రమంలో వారి ఇద్దరు కుమారులు దేవేంద్ర, బుల్బుల్ అక్కడి నుంచి పారిపోవడానికి టెర్రస్ పైకి వెళ్లి, భయంతో ఇంటిపై నుంచి కింది దూకారు.




వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు దిలీప్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన చిన్నారులను బాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం సేవించేవాడని విచారణలో తేలింది. ఐతే ఈ సంఘటన జరిగిన సమయంలో అతడు అతను మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




