AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బెంగాల్ సుభిక్ష మార్గంలో ఎదగాలి.. కోల్‌కతాలో దుర్గాపూజలకు అంకురార్పణలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

Minister Dharmendra Pradhan: కోల్‌కతాలో ఇవాళ దుర్గాపూజలకు అంకురార్పణ జరిగింది. ఈ ఖూంటి పూజతోనే దసరా వేడుకలు ప్రారంభవుతాయి. దుర్గాపూజలకు ముందు జరిగే ఖూంటి పూజలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో పశ్చిమ బెంగాల్ సుభిక్ష మార్గంలో ఎదగగలదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

Watch: బెంగాల్ సుభిక్ష మార్గంలో ఎదగాలి.. కోల్‌కతాలో దుర్గాపూజలకు అంకురార్పణలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Minister Dharmendra Pradhan
Sanjay Kasula
|

Updated on: Aug 20, 2023 | 7:41 PM

Share

కోల్‌కతాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇక్కడ ఆయన కొత్త మార్కెట్‌లోని శ్రీశ్రీశ్రీ సర్బోజనిన్ దుర్గాపూజ పండల్ కమిటీ చేపట్టిన దుర్గా మహోత్సవంలో కుంతీపూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యాగం, హోంలో కేంద్రమంత్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా పందల కమిటీలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. న్యూ మార్కెట్ పబ్లిక్ శ్రీశ్రీశ్రీ దుర్గాపూజా సమితి స్తంభానికి ఆయన పూజలు చేశారు. ఈ ఏడాది ఈ పూజ 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఖూంటి పూజలో ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు బీజేపీ స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఖూంటి పూజ చిత్రాన్ని పంచుకున్నారు.

దుర్గాపూజను బెంగాలీలో అతిపెద్ద పండుగ చెప్పుకోవచ్చు. ఈ పూజను కోల్‌కతాలో ఘనంగా జరుపుకుంటారు. దుర్గాపూజ పండల్ ప్రారంభమయ్యే ముందు ఖూంటి పూజ నిర్వహిస్తారు. ఇదే పూజా కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. కొత్త మార్కెట్‌లో జరిగిన ఖూంటి పూజలో పాల్గొన్న అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పండుగలు, పీఆర్‌లు ఒకదానికొకటి సంపూర్ణంగా కలిసి ఉంటాయన్నారు.

ఇలాంటి కర్యాక్రమాలకు పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేయండం.. హోర్డింగ్‌లను ఉపయోగించుకోవడం.. ప్రజలతో కలిసిపోవాలని సూచించారు.  వీలైనంత వరకు అక్కడే ఉండండి.. జన్మాష్టమికి సంబంధించిన పనులన్నీ ఇందులో ఉండాల్సిందే అని అన్నారు.  ప్రజా సంబంధాల ద్వారా పార్టీ బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.

ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఫొటోను షేర్ చేశారు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుంతీ పూజ చేసిన తర్వాత పూజకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

న్యూ మార్కెట్ సర్బోజనిన్ శ్రీ శ్రీ దుర్గా పూజా సమితి పండల్ వద్ద దుర్గోత్సవాన్ని ఖూంటి పూజతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుంతీ పూజ ముగియగానే..కోల్‌కతా దుర్గాపూజకు సన్నాహాలు ముమ్మరంగా ప్రారంభమవుతాయి.

ప్రధాని మోదీ  కృషి కారణంగానే ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుర్గాపూజ యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. మా దుర్గా ఆరాధన చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని.. దుర్గామాత ఆశీస్సులతో పశ్చిమ బెంగాల్ సుభిక్ష మార్గంలో ఎదగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం