Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thieves: వీళ్లు మంచి దొంగలు.. చోరీ చేశాక గుడికెళ్లి మొక్కుబడులు చెల్లిస్తారు!

ఈ దొంగలు పరమభక్తి పరులు సుమీ..! స్వామీ.. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా దొంగతనం విజయవంతమైతే నీ కొండకు వచ్చి తలనీలాలు అర్పించుకుంటాం.. నిలువు దొపిడీ ఇచ్చుకుంటాం అంటూ ఏకంగా దేవుడితోనే బేరాలు పెట్టసాగారు. అనుకున్నట్టు దొంగతనం విజయవంతమైతే ఇచ్చినమాట ప్రకారం గుడికెళ్లి మొక్కుబడులు చెల్లించుకునే వారు. ఇలా ప్రతి దొంగతనానికి దేవుడికి మొక్కుకోవడం.. చోరీల అనంతరం గుడికెళ్లి మొక్కుబడులు చెల్లించుకోవడం వీరికి..

Thieves: వీళ్లు మంచి దొంగలు.. చోరీ చేశాక గుడికెళ్లి మొక్కుబడులు చెల్లిస్తారు!
Representative Photo
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2023 | 9:08 AM

బెంగళూరు, ఆగస్టు 21: ఈ దొంగలు పరమభక్తి పరులు సుమీ..! స్వామీ.. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా దొంగతనం విజయవంతమైతే నీ కొండకు వచ్చి తలనీలాలు అర్పించుకుంటాం.. నిలువు దొపిడీ ఇచ్చుకుంటాం అంటూ ఏకంగా దేవుడితోనే బేరాలు పెట్టసాగారు. అనుకున్నట్టు దొంగతనం విజయవంతమైతే ఇచ్చినమాట ప్రకారం గుడికెళ్లి మొక్కుబడులు చెల్లించుకునే వారు. ఇలా ప్రతి దొంగతనానికి దేవుడికి మొక్కుకోవడం.. చోరీల అనంతరం గుడికెళ్లి మొక్కుబడులు చెల్లించుకోవడం వీరికి సెంటిమెంట్‌గా మారిపోయింది. బెంగళూరుకు చెందిన ఈ విచిత్ర దొంగల వివరాలు మీకోసం..

బెంగళూరులోని సదాశివనగరానికి చెందిన మంజునాథ, యతీశ్‌ అనే ఇద్దరు చోరులు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుండే వారు. దొంగతనాలకు వెళ్లే ముందు తమ ఇష్టదైవానికి ప్రతిసారీ మొక్కుకుంటారు. ఆనక చోరీ సఫలం అవ్వగానే గుడికెళ్లి మొక్కుబడులు చెల్లించేవారు. ఈ క్రమంలో గిరినగర పరిధిలో శ్యామల అనే వృద్ధురాలి గొలుసును ఆగస్టు 13న వీరు చోరీ చేసి పరారయ్యారు. బంగారు గొలుసు చోరీతోపాటు, వాహనం దొంగతనం అనంతరం మలెమహదేశ్వర స్వామి గుడికి వెళ్లారు ఇద్దరు దొంగలు. తల నీలాలు ఇచ్చి, హుండీలో కానుకలు వేశారు.

గుడికి వెళ్లి, మొక్కు చెల్లించుకుని ఇంటికి వచ్చేసరికి ఊహించని రీతిలో వారి ఎదుట పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గొలుసు చోరీ సమయంలో స్థానిక సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించ గలిగారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ సాయంతో త్వరగానే నిందితులను పోలీసులు అరెస్టు చేయగలిగారు. అనంతరం నిందితుల నుంచి 25 గ్రాముల బంగారం, మూడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గిరినగర ఠాణా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.