Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-China Dispute: చైనా ఆక్రమణలు వాస్తవమన్న రాహుల్‌.. నెహ్రూ హయాంలోనే జరిగిందంటూ బీజేపీ కౌంటర్..

Rahul Gandhi - Ravi Shankar Prasad: లద్దాఖ్‌లో చైనా భూఆక్రమణలు ముమ్మాటికి వాస్తవమన్నారు రాహుల్‌గాంధీ. స్థానికులు కూడా ఇదే మాట చెబుతున్నప్పటికి ప్రధాని మోదీ నమ్మడం లేదన్నారు. భారత సైన్యం త్యాగాలను రాహుల్‌గాంధీ అవహేళన చేస్తున్నారని బీజేపీ మండిపడింది.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2023 | 9:07 AM

Rahul Gandhi – Ravi Shankar Prasad: ప్రధాని మోదీపై మరోసారి విరుచుపడ్డారు రాహుల్‌గాంధీ. లద్దాఖ్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా తమ భూమిని లాగేసుకుందని లద్దాఖ్‌ వాసులు చెబుతుంటే ప్రధాని మోదీ మాత్రం చైనా ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని అంటున్నారని అన్నారు. మోదీ అసత్యాలు చెబుతున్నారని , స్థానికులు కూడా ఈవిషయాన్ని ఒప్పుకుంటున్నారని అన్నారు. చైనా ఆర్మీ లద్దాఖ్‌లో ఆక్రమణలు చేసిన మాట ముమ్మాటికి వాస్తవమని పేర్కొన్న రాహుల్‌.. లద్దాఖ్‌లో భూములు కోల్పోయిన రైతులు చాలా బాధలో ఉన్నారని అన్నారు. చైనా తమ భూమిని లాగేసుకుందని స్థానికులు ఆవేదనలో ఉన్నారు. సరైన రోడ్డు మార్గాలు కూడా లేవు. మొబైల్‌ నెట్‌వర్క్‌ కూడా లేదు. చైనా సైన్యం ఈ ప్రాంతం లోకి దూసుకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఒక్క అంగుళం కూడా భూమి పోలేదన్న ప్రధాని మాటలు అవాస్తవమంటూ రాహుల్ పేర్కొన్నారు.

నెహ్రూ హయాంలోనే..

మూడేళ్లక్రితం 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు దేశాల సేనల్లో పెద్ద ఎత్తున మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇరు సేనల మధ్య సరిహద్దులో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. నెహ్రూ హయాం లోనే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణలకు పాల్పడిందని బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ కౌంటరిచ్చారు.

లద్ధాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై స్థానికులు సంతోషంగా లేరని రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్‌లో నిరుద్యోగం పెరిగిందన్నారు. రాహల్‌గాంధీ శనివారం బైక్‌పై పాంగాంగ్ లేక్‌కు చేరుకున్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా లద్దాఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..