Kerala: 5 రోజుల వయసున్న శిశువుకు ఒకేసారి 5 టీకాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Kerala: 5 రోజుల వయసున్న శిశువుకు ఒకేసారి 5 టీకాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Anil kumar poka

|

Updated on: Aug 21, 2023 | 8:15 AM

5 రోజుల పసికందుకు ఒకేసారి 5 టీకాలు వేసిన దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నర్సు నిర్వాకంతో చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ శిశువు తల్లిదండ్రులు చిన్నారికి బీసీజీ టీకా వేయించేందుకు స్థానికంగా ఉన్న ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ వైద్యుడితో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని,

5 రోజుల పసికందుకు ఒకేసారి 5 టీకాలు వేసిన దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నర్సు నిర్వాకంతో చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ శిశువు తల్లిదండ్రులు చిన్నారికి బీసీజీ టీకా వేయించేందుకు స్థానికంగా ఉన్న ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ వైద్యుడితో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని, దాన్ని అక్కడి నర్సు చారులతకు చూపించారు. బిడ్డకు బీసీజీ టీకాకోసం వచ్చామని చెప్పడంతో నర్సు అకారణంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత బిడ్డకు తొలుత ఎడమ భుజంపై బీసీజీ టీకా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా బిడ్డ తొడలపై మరో రెండు రకాల టీకాలు, ఆ తరువాత నోట్లో చుక్కలమందు వేసింది. అనుమానం వచ్చిన శిశువు తల్లిదండ్రులు వెంటనే డాక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ నర్సు బిడ్డకు బీసీజీతో పాటూ పెంటావేలెంట్ పోలియో టీకా, న్యూమోకొక్కల్ టీకా, నోటి ద్వారా తీసుకునే పోలియో టీకాతో పాటూ రోటావైరస్ టీకా వేసినట్టు తేలింది. దాంతో అధికారులు నిందితురాలిని సస్పెండ్ చేశారు. ఘటనపై డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి అయిదు టీకాలు తీసుకోవడంతో అనారోగ్యం పాలైన చిన్నారికి పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...