Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన జంట.. బైక్‌పై దూసుకెళ్తూ తుపాకులు పట్టుకొని రచ్చ.. రంగంలోకి దిగిన పోలీసులు

పాట్నాకు చెందిన ఓ యువతి ఓ యువకుడు రాత్రివేళ వేగంగా బైక్‌పైన దూసుకెళ్తున్నారు. మెరైన్‌ డ్రైవ్‌ మాదిరిగా స్టంట్‌ చేయాలనుకున్నారో ఏమో, జేపీ గంగా పాథ్‌వేపై యువకుడు బైక్‌‏ను స్పీడుగా నడుపుతుండగా, వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది.

Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన జంట.. బైక్‌పై దూసుకెళ్తూ తుపాకులు పట్టుకొని రచ్చ.. రంగంలోకి దిగిన పోలీసులు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2023 | 11:02 AM

సోషల్ మీడియా పుణ్యమా యువత తన బార్డర్స్‎ని దాటేస్తోంది. నెట్టింట్లో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. విచక్షణ కోల్పోయి ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మొన్నామధ్య నడిరోడ్డుమీద రన్నింగ్ బైకుపై కూర్చుని ముద్దులు పెట్టుకుని హద్దులు దాటారు లవర్స్‌, తాజాగా నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఓ బీహారీ యువతి నడిరోడ్డుపై రెచ్చిపోయింది. సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్స్ చేసింది . రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని స్పీడ్ గా వెళ్తున్న బైక్‎పై నిలబడి నానా రచ్చ చేసింది. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడింది. దీంతో యువతి చిక్కుల్లో పడినట్లైంది. బీహార్‌లోని పట్నాలో ఈ సంఘటన జరిగింది.

పాట్నాకు చెందిన ఓ యువతి ఓ యువకుడు రాత్రివేళ వేగంగా బైక్‌పైన దూసుకెళ్తున్నారు. మెరైన్‌ డ్రైవ్‌ మాదిరిగా స్టంట్‌ చేయాలనుకున్నారో ఏమో, జేపీ గంగా పాథ్‌వేపై యువకుడు బైక్‌‏ను స్పీడుగా నడుపుతుండగా, వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది. ఈ దృష్యాలన్నింటిని ఆ పక్కనే వస్తున్న బైకర్స్ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో

అది కాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోపై పట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. వీడియో ఆధారంగా బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబంర్‌ను గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..