Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindupuram: హిందూపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త అరెస్ట్..! కారణం అదే అంటూ గుసగుసలు

మట్కా, అక్రమ మద్యం కేసుల్లో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ భర్త శ్రీనివాసులును పోలీసులు సోమవారం (ఆగస్టు 21) అరెస్ట్‌ చేశారు. శ్రీనివాసులుతోపాటు ఆయన అనుచరులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి మద్యం తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. అలాగే మట్కా దందా కూడా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐతే హిందూపుర నియోజకవర్గ వైఎస్‌ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త దీపిక..

Hindupuram: హిందూపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త అరెస్ట్..! కారణం అదే అంటూ గుసగుసలు
Hindupuram Municipal Chairperson Husband Arrest
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 22, 2023 | 8:08 AM

హిందూపురం, ఆగస్టు 22: మట్కా, అక్రమ మద్యం కేసుల్లో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ భర్త శ్రీనివాసులును పోలీసులు సోమవారం (ఆగస్టు 21) అరెస్ట్‌ చేశారు. శ్రీనివాసులుతోపాటు ఆయన అనుచరులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి మద్యం తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. అలాగే మట్కా దందా కూడా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐతే హిందూపుర నియోజకవర్గ వైఎస్‌ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త దీపిక వర్గీయులకు మద్దతు తెలపనందుకు తమపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల ఛైర్‌పర్సన్ ఇంద్రజ, ఆమె భర్త ఓ కార్యక్రమంలో వాపోయారు.

ఈ ఆరోపణలు నిజంచేస్తూ మట్కా, అక్రమ మద్యం విక్రయాల పేరిట తాజాగా ఇంద్రజ భర్త శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం. దీనిపై పోలీసులను వివరణ కోరగా విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా హిందూపరంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే అక్కడ అధికారిక పార్టీకి చెందిన కొందరి మాటే చెల్లుబాటు అవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కక్ష్య సాధింపుల కింద వారి ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కొందరు స్థానిక నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హయాంలో కూడా హిందూపురం నియోజకవర్గంలోని ముఖ్యనేతలైన నవీన్‌ నిశ్చల్‌, కొండూరు వేణుగోపాల్‌రెడ్డిలపై అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి.

ఇక కొత్తగా సమన్వయకర్తగా నియమితులైన దీపిక కూడా తీరుమార్చుకోకుండా అదేబాటలో తమ మాట వినని వారిపై అక్రమంగా కేసులు బనాయించి పోలీసులచే అరెస్ట్‌ చేయిస్తోంది. ఇక మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజపై ఆమె భర్త శ్రీనివాసులుపై చాన్నాళ్ల క్రితం నుంచే మట్కా దందా విషయమై కేసులు ఉన్నాయి. మాజీ సమన్యయకర్త ఇక్బాల్‌ హయాంలో నాలుగేళ్లు వీరి హవా నడవడంతో ఇంద్రజ వ్యాపారాలకు ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు. ఇక తాజాగా దీపిక వచ్చాక పొరపొచ్చాలు రావడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు తాజాగా కేసులు బనాయించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.