Vijayawada: తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గ గుడి మాస్టర్ ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..

Vijayawada: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతోన్న 70 కోట్ల ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు, సంబంధిత పనుల రూపకల్పన కోసం ఆర్ కొండలరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ బృందం ఆదివారం ఇంద్రకీలాద్రిని పరిశీలించింది. ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తదితర పనుల గురించి టెక్నికల్ కమిటీ బృందానికి పూర్తిస్థాయిలో వివరించారు. అనంతరం ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు టెక్నికల్ బృందం కొన్ని సూచనలు, సలహాలు..

Vijayawada: తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గ గుడి మాస్టర్ ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
Durga Temple Review Meet
Follow us
M Sivakumar

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 22, 2023 | 6:29 AM

విజయవాడ, ఆగస్టు 22: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ మేరకు సుమారు 70 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచనున్నారు. ఫలితంగా రానున్న కాలంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ దోహదపడనుందని అధికారులు చెబుతున్నారు.

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతోన్న 70 కోట్ల ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు, సంబంధిత పనుల రూపకల్పన కోసం ఆర్ కొండలరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ బృందం ఆదివారం ఇంద్రకీలాద్రిని పరిశీలించింది. ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తదితర పనుల గురించి టెక్నికల్ కమిటీ బృందానికి పూర్తిస్థాయిలో వివరించారు. అనంతరం ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు టెక్నికల్ బృందం కొన్ని సూచనలు, సలహాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, టెక్నికల్ బృందం లో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ అండ్ దేవాదాయ శాఖ టెక్నికల్ అడ్వైజర్ ఆర్. కొండలరావు, బెంగళూరు ప్రొఫెసర్ శివ కుమార్ బాబు, ఐఐటీ మద్రాస్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అప్పారావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి. ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, ఇంజినీరింగ్ విభాగం మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి చేయబోయే అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు.