Hair Tips: జుట్టు చాలా పల్చగా ఉందా..? ఇలా చేశారంటే ఒత్తుగా మారడం ఖాయం..!

Hair Care: కేశ సమస్యలకకు ఒకటి, రెండు కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక ఈ సమస్యలను నివారించుకోకుండానే జుట్టు పెరగాలని, రాలడం ఆగాలని మార్కెట్‌లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు కొందరు. ఈ ప్రోడక్స్ట్ వల్ల జుట్టు పెరుగుతుందన్న గ్యారంటీ లేదు, కానీ కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జుట్టుకు పోషణ అందిస్తే మీ జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం ఆగుతుంది. ఇందుకోసం మీరు కొన్ని హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తే చాలు, జుట్టును..

Hair Tips: జుట్టు చాలా పల్చగా ఉందా..? ఇలా చేశారంటే ఒత్తుగా మారడం ఖాయం..!
Hair Care
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 19, 2023 | 6:11 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యల్లో కేశ సమస్యలు కూడా ప్రధానమైనవి. జుట్టు రాలడం, పొట్టి జుట్టు, చుండ్రు.. ఇలాంటి సమస్యలకకు ఒకటి, రెండు కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక ఈ సమస్యలను నివారించుకోకుండానే జుట్టు పెరగాలని, రాలడం ఆగాలని మార్కెట్‌లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు కొందరు. ఈ ప్రోడక్స్ట్ వల్ల జుట్టు పెరుగుతుందన్న గ్యారంటీ లేదు, కానీ కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జుట్టుకు పోషణ అందిస్తే మీ జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం ఆగుతుంది. ఇందుకోసం మీరు కొన్ని హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తే చాలు, జుట్టును ఒత్తుగా చేస్తాయి. అవేంటంటే..

అవొకాడో హెయిర్ మాస్క్: జుట్టు సమస్యలు ఉన్నవారు ముందుగా ఒక అవొకాడో పండును తీసుకుని, మెత్తని పేస్ట్‌గా చేయండి. ఆ తర్వాత దీనికి ఒక స్పూన్ గ్రీన్ టీ, మరో స్పూన్ మెంతి పొడిని కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేయండి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. తరచుగా ఇలా చేస్తే మీ జుట్టు ఒత్తుగా మారుతుంది. బలంగా కూడా ఉంటుంది.

కాఫీ హెయిర్ మాస్క్: కాఫీ హెయిర్ మాస్క్ నెత్తి మీద రక్త ప్రసరణను పెంచడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాక ఇది జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సైతం సహకరిస్తుంది. ఇందుకోసం 50 గ్రాముల కాఫీ పొడిని 230 మిల్లీలీటర్ల నీటిలో మిక్స్ చేసి గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో 24 గంటల పాటు ఉంచండి. ఆపై దాన్ని బయటకు తీసి వడకట్టి, స్ప్రే బాటిల్‌లో పోసి 2 వారాల పాటు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోండి. 2 వారాల తర్వాత దీన్ని రోజుకు 2 సార్లు తలకు అప్లై చేయవచ్చు. ఈ మాస్క్‌ని తలపై స్ప్రే చేసినప్పుడు మీ జుట్టును టవల్‌ను చుట్టండి. అలా చేసిన 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.

ఇవి కూడా చదవండి

మెంతులు: మెంతులు నానబెట్టిన గంజి నీళ్లతో జుట్టును కడిగినా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా వారానికి 3, 4 సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతాయి.

ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసం కూడా జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయల రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు ఆగుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇందుకోసం మీరు కొన్ని ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టుకు, బాగా అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం