Health Tips: అత్తిపండ్లను తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..

Health Tips: అంజీర్ లేదా అత్తిపండ్లు ఆరోగ్యానికి మంచివి. శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అత్తిపండ్ల ద్వారా లభిస్తాయి. ఫలితంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. అయితే అత్తిపండ్లను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలా మంది చెబుతుంటారు. ఈ మాట నిజమేనా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 18, 2023 | 3:28 PM

Health Tips: అత్తిపండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా అత్తిపండ్లను ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.

1 / 5
అలాగే అత్తిపండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య ఎదురవుతుంది. ఎండిన అత్తి పండ్లలో సల్ఫేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇలా సల్ఫైడ్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం మైగ్రేన్ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ఈ అత్తిపండ్లను అతిగా తింటే కడుపు నొప్పి సమస్య కూడా రావచ్చు. ఎక్కువ మొత్తంలో అత్తిపండ్లను తింటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడి, కడుపునొప్పి వస్తుంది. ఈ క్రమంలోనే మీకు అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కూడా ఎదురవుతాయి.

3 / 5
అత్తి పండ్లను ఎక్కువగా తినడం దంతాలకు కూడా హానికరం. ఈ క్రమంలో మీ దంతాలు పుచ్చిపోతాయి. అత్తిపండ్లలో అధికంగా ఉండే చక్కెర పంటి నొప్పి, దంతక్షయం వంటి సమస్యలను దారితీస్తుంది.

4 / 5
అత్తిపండ్లు మధుమేహంతో బాధపడేవారి ఆరోగ్యానికి మంచివే. కానీ పరిమితి దాటి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్‌ని పెంచుతాయి. ఈ కారణంగా అత్తిపండ్లను పరిమితిగా తీసుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మంచింది.

5 / 5
Follow us