- Telugu News Photo Gallery Cricket photos Jasprit Bumrah to be 11th T20I Captain for India, check here for full list of Indian Captains List in the Short Format
IND vs IRE: సెహ్వాగ్, ధోని లిస్టులోకి యార్కర్ కింగ్ బూమ్రా.. ఇప్పటిదాకా భారత ‘కెప్టెన్’గా ఎవరెవరు ఉన్నారంటే..?
IND vs IRE, Team India: ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో.. టీమిండియాను యార్కర్ కింగ్ జస్ర్పీత్ బూమ్రా నడిపించనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న బూమ్రా పునరాగమన మ్యాచ్‌లోనే భారత్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు అరుదైన ఘనత సాధించబోతున్నాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 18, 2023 | 4:35 PM

IND vs IRE, Team India: ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియాను జస్ప్రీత్ బూమ్రా నడిపించబోతున్నాడు. దీంతో బూమ్రా భారత టీ20 జట్టుకు 11వ కెప్టెన్‌గా అవతరించనున్నాడు. ఈ క్రమంలో బూమ్రా కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్ మొదలు మొత్తం 10 మంది ఈ బాధ్యతలు నిర్వహించారు.

1. వీరేంద్ర సెహ్వాగ్: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత టీ20 జట్టుకు తొలి కెప్టెన్. 2006లో సెహ్వాగ్ ఒక టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు నాయకత్వం వహించి, భారత్‌కి తొలి మ్యాచ్‌లోనే విజయం అందించాడు.

2. మహేంద్ర సింగ్ ధోని: 2007 నుంచి 2016 వరకు ఎంఎస్ ధోని భారత జట్టుకు మొత్తం 72 టీ20 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో 41 మ్యాచులను గెలిచిన టీమిండియా 28 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్ టై అవగా, ఇంకో 2 మ్యాచ్‌లు రద్దయ్యాయి.

3. సురేశ్ రైనా: 2010-11 మధ్య ధోనీ గైర్హాజరీ సమయలో రైనా 3 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రైనా సారథ్యంలో ఆడిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

4. అజింక్యా రహానే: 2015లో అజింక్య రహానే 2 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ 2 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.

5. విరాట్ కోహ్లీ: విరాట్ కోహ్లీ 2017 నుంచి 2021 వరకు 50 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 30 మ్యాచ్‌లను గెలవగా.. 16 మ్యాచ్‌ల్లో ఓడింది. అలాగే 2 మ్యాచ్‌లు టై, మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

6. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ సారథ్యంలో 51 టీ20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

7. శిఖర్ ధావన్: కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో శిఖర్ ధావన్ 3 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. శిఖర్ సారథ్యంలో టీమిండియా 2 మ్యాచ్‌ల్లో ఓడి, 1 మ్యాచ్‌లో విజయం సాధించింది.

8. రిషబ్ పంత్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మ్యాన్ రిషబ్ పంత్ 5 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంలో భారత్ 2 మ్యాచ్‌లు గెలిస్తే.. ఇంకో 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

9. కేఎల్ రాహుల్: కేఎల్ రాహుల్ ఒక్క టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా కనిపించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.

10. హార్దిక్ పాండ్యా: టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 16 మ్యాచ్‌ల్లో టీమిండియాను నడిపించాడు. ఈ క్రమంలో భారత్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 5 మ్యాచ్‌ల్లో ఓడింది. మిగిలిన 1 మ్యాచ్ టై అయింది.





























