- Telugu News Photo Gallery Cricket photos Steve Smith, Mitchell Starc ruled out of South Africa tour, Mitch Marsh to captain Australia in ODI Format
Australia: ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గాయం.. జట్టు నుండి ఔట్..
Australia Team: భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ఇంకా 48 రోజులే మిగిలి ఉండడంతో అన్ని జట్లు సన్నాహాల్లో ఉన్నాయి. గాయాల పాలైన ఆటగాళ్లు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆసీస్ టీమ్‌లోని స్టార్ బ్యాటర్ స్టీమ్ స్మిత్, స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కి గాయాలై ఆటకు దూరంగా ఉండబోతున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ధృవీకరించింది.
Updated on: Aug 18, 2023 | 6:45 PM

Australia Team: భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కి ముందుగానే.. ఆస్ట్రేలియా టీమ్ దక్షిణాఫ్రికా, భారత్ పర్యటనలు చేయనుంది. అయితే ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాల కారణంగా దక్షిణాఫ్రికా టూర్ నుంచి దూరంగా ఉంటున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో కంగారుల టీమ్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

వీరిద్దరి కంటే ముందే ఆసీస్ టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయపడ్డాడు. దీంతో కమ్మిన్స్ కూడా సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడడం లేదు. అయితే భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ సమయానికి వీరంతా కోలుకోవాలని ఆసీస్ బోర్డ్ కోరుకుంటోంది.

స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా టూర్ నుంచి తప్పుకోవడంతో వన్డే జట్టులోకి మార్నస్ లబుషెన్ వచ్చాయి. ముందుగా అతను ఎంపిక కాలేదు. కానీ ఇప్పుడు అతని అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావించి అతన్ని జట్టులోకి తీసుకుంది.

స్మిత్, స్టార్క్ విషయంలో ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 22 నుంచి భారత్‌లో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఈ స్టార్ ప్లేయర్లు తిరిగి వస్తారిన తెలిపాడు.

అలాగే దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఆసీస్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా పదోన్నతి పొందిన మార్ష్.. ఇప్పుడు కమిన్స్ స్థానంలో వన్డే సిరీస్‌లోనూ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఆస్ట్రేలియా టీ20 జట్టు: మిచెల్ మార్ష్(కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా

ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుషెన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా





























