- Telugu News Photo Gallery Cricket photos Ind vs ire 1st t20i the village cricket stadium pitch favors batters check here pitch report
IND vs IRE: డబ్లిన్ పిచ్ ఏ జట్టుకు అనుకూలంగా ఉంటుంది? టాస్ ఓడితే పంచ్ పడినట్లేనా.. హిస్టరీ ఏం చెబుతుందంటే?
IRE vs IND 1st T20I, The Village Pitch Report: భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మొదటి T20I మ్యాచ్ ఈరోజు డబ్లిన్‌లోని ది విలేజ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడి పిచ్ చూస్తుంటే.. బ్యాట్స్ మెన్‌కు మరింత అనుకూలంగా ఉందని స్పష్టమవుతోంది. కాగా, ఈ పిచ్ లో టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే బౌలర్లకు అంతగా సహకారం లభించని భావిస్తున్నారు.
Updated on: Aug 18, 2023 | 1:39 PM

వెస్టిండీస్‌పై 3-2 తేడాతో ఓటమి చవిచూసిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఐర్లాండ్‌తో మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఈరోజు (ఆగస్టు 18) డబ్లిన్‌లోని ది విలేజ్‌లో జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన ఐర్లాండ్ సిరీస్ లో టీమ్ ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఒక సంవత్సరం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి కొత్త ఆటగాళ్లు కూడా జట్టులోకి వచ్చారు. దీంతో పాటు యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్‌లు ఎంపికయ్యారు.

కాగా, శివమ్ దూబే, ప్రసీద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ పునరాగమనం చేయడంతో ఈ మ్యాచ్‌లపై అంచనాలు పెరిగాయి. అలాగే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ అగ్నిపరీక్షగా మారనుంది.

తొలి టీ20 మ్యాచ్ జరగనున్న విలేజ్ క్రికెట్ స్టేడియంలో ఇటీవలి టీ20 రికార్డులను పరిశీలిస్తే.. ఈ పిచ్ బ్యాట్స్ మెన్‌కు మరింత అనుకూలంగా ఉందని స్పష్టమవుతోంది. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 167గా నిలిచింది.

మ్యాచ్ సాగుతున్న కొద్దీ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించదు. ఈ పిచ్ ఛేజింగ్‌కు ప్రసిద్ధి చెందింది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం మంచిది.

డబ్లిన్ వాతావరణ నివేదిక ప్రకారం, ఆగస్ట్ 18, శుక్రవారం డబ్లిన్‌లోని ది విలేజ్‌లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం విలన్‌గా మారే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే రోజు 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. దాదాపు 6 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

జస్ప్రీత్ పునరాగమనం టీమ్ ఇండియాకు కీలకంగా మారింది. సెప్టెంబర్ 2022 నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా, గత ఆసియా కప్ టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి ప్రధాన టోర్నమెంట్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ ద్వారా పునరాగమనం చేస్తున్నాడు.

భారత కాలమానం ప్రకారం భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వయాకామ్ 18 ప్రత్యక్ష ప్రసార హక్కులను కలిగి ఉంది. స్పోర్ట్ 18లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ప్రత్యక్ష ప్రసారం DD స్పోర్ట్స్‌లో కూడా కనిపిస్తుంది. జియో సినిమాలో స్ట్రీమింగ్ ఉంటుంది.





























