MS Dhoni: జిమ్‌లో ప్రత్యక్షమైన ధోని.. కండలు చూసి ‘ఐపీఎల్‌ 2024 కోసం వెయిటింగ్’ అంటున్న నెటిజన్లు..

MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని మైదానంలోకి అడుగుపెడితే మళ్లీ మళ్లీ చూడాలని కోరుకునే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉంటే ధోనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ధోని బ్లాక్ బనియన్, బ్లాక్ షాట్ ధరించి తన ఫిట్‌నెస్‌ని చూపిస్తున్నట్లుగా పోజ్ ఇచ్చాడు. ధోనికి సంబంధించిన ఈ ఫోటో రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ కాంప్లెక్స్‌లో తీసినదని, అక్కడ ధోని కనిపించాడని kushmahi7 అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేశాడు. అలాగే మరికొందరు..

MS Dhoni: జిమ్‌లో ప్రత్యక్షమైన ధోని.. కండలు చూసి ‘ఐపీఎల్‌ 2024 కోసం వెయిటింగ్’ అంటున్న నెటిజన్లు..
M S Dhoni
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 19, 2023 | 7:42 PM

క్రికెట్ ప్రపంచంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఓ ప్రత్యేక స్థానం. క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజ క్రికెటర్లు ఉన్నా ధోనికి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోని.. మైదానంలో అడుగుపెడితే మళ్లీ మళ్లీ చూడాలని కోరుకునే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉంటే ధోనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ధోని బ్లాక్ బనియన్, బ్లాక్ షాట్ ధరించి తన ఫిట్‌నెస్‌ని చూపిస్తున్నట్లుగా పోజ్ ఇచ్చాడు. ధోనికి సంబంధించిన ఈ ఫోటో రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ కాంప్లెక్స్‌లో తీసినదని, అక్కడ ధోని కనిపించాడని kushmahi7 అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేశాడు. అలాగే మరికొందరు తమ అభిమాన క్రికెటర్ ధోనికి సంబంధించిన ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ తమలోని అభిమానానాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ పలికిన ధోనిని ఐపీఎల్‌లో అయినా మరికొంత కాలం దగ్గరగా చూడాలని, అందుకోసం ధోని తొందరగా ఫిట్‌నెస్ సాధించాలని కోరుకంటున్నారు.

ఇవి కూడా చదవండి

వెయింటింగ్..

తగ్గేదేలే.. 

వయసు ఓ సంఖ్య మాత్రమే…

ఫిట్‌నెస్ లెవెల్.. 

కాగా, 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి విడ్కోలు పలికిన ధోని.. ఆ తర్వాత ఐపీఎల్ క్రికెట్‌ ద్వారా అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపిఎల్ 2023 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌ని 5వ సారి టైటిల్ విన్నర్‌గా నిలిపాడు.

ధోని సేన..

అయితే ఐపీఎల్ తర్వాత మోకాలి ఆపరేషన్ చేయించుకున్న ధోని క్రమంగా కోలుకున్నాడు. అయితే ధోని వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కనిపిస్తాడా లేదా అనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ ధోని ఐపీఎల్‌లో మళ్లీ మళ్లీ కనిపించాలని సీఎస్‌కే ఫ్యాన్స్ మాత్రమే కాక, ఇతర ఐపీఎల్ జట్ల అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి