IND vs IRE: భారత్‌పై ఓడినా రికార్డ్ సృష్టించిన ఐర్లాండ్.. టీ20 చరిత్రలో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క టీమ్‌గా..

IND vs IRE, 1st T20I: టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఐర్లాండ్ టీమ్ తొలి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఐరీష్ బ్యాటర్లు 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేశారు. ఐర్లాండ్ తరఫున బారీ మెక్‌కార్తీ(51, నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, కర్టీస్ కాంపర్ 39 పరుగులతో మెప్పించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసే సమయానికి వర్షం అడ్డుపడింది. దీంతో డర్క్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించినట్లుగా అంపైర్లు..

IND vs IRE: భారత్‌పై ఓడినా రికార్డ్ సృష్టించిన ఐర్లాండ్.. టీ20 చరిత్రలో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క టీమ్‌గా..
Ireland Cricket Team
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 19, 2023 | 5:49 PM

IND vs IRE 1st T20I: డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఐర్లాండ్ టీమ్ తొలి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఐరీష్ బ్యాటర్లు 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేశారు. ఐర్లాండ్ తరఫున బారీ మెక్‌కార్తీ(51, నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, కర్టీస్ కాంపర్ 39 పరుగులతో మెప్పించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసే సమయానికి వర్షం అడ్డుపడింది. దీంతో డర్క్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించినట్లుగా అంపైర్లు ప్రకటించారు.

అయితే వర్షం కారణంగా భారత్‌పై ఓడిపోయిన ఐర్లాండ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డ్‌ను రెండు సార్లు నమోదు చేసింది. అదెలా అంటే.. భారత్‌పై బ్యాటింగ్ ఆడుతున్న క్రమంలో ఐర్లాండ్ టీమ్ 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ అపై వచ్చిన బ్యాటర్లే 108 పరుగులు చేశారు. ఇలా టీ20 క్రికెట్‌లో అతి తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, ఆపై 100కు పైగా పరుగులు చేసిన ఒకే ఒక్క జట్టుగా ఐర్లాండ్ అవతరించింది. ఐర్లాండ్ గతంలోనూ ఇలాంటి ఘనతను సాధించింది. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో.. ఐర్లాండ్ 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, ఆ తర్వాత మిగతా బ్యాటర్ల సహాయంతో ఏకంగా 137 పరుగులు చేసింది. ఇది టీ20 క్రికెట్‌లో ఓ ప్రపంచ రికార్డు. ఇదే రికార్డ్‌ను ఐర్లాండ్ భారత్‌పై తాజాగా మరోసారి 100కు పైగా రన్స్ చేసి చూయించింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రం చేశారు. అలాగే దాదాపు 327 రోజుల తర్వాత ఆటలోకి పునరాగమనం చేసిన బూమ్రా కెప్టెన్‌గా 2 వికెట్లు, తొలి టీ20 విజయం అందుకున్నాడు. ఇంకా ఆరంగేట్ర ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. అయితే అరంగేట్ర ఆటగాడు రింకూకి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.

బారీ మెక్‌కార్తీ మెరుపులు.. 

భారత్‌దే తొలి టీ20.. 

ఆటలోకి యువ ఆటగాళ్లు.. 

ఏ మార్పు లేదు.. 

మిషన్ సక్సెస్.. 

తొలి టీ20 ఆడిన ఇరు జట్లు..

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ క్యాంపర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్.

భారత్: రితురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు