- Telugu News Photo Gallery Cricket photos Arshdeep Singh breaks Malinga's unfortunate record for bowling the third most no balls in T20Is
IND vs IRE: మలింగ ‘చెత్త రికార్డ్’ని బ్రేక్ చేసిన అర్ష్‌దీప్.. ఆ లిస్టులో అందరూ దిగ్గజ బౌలర్లే, కానీ..
IND vs IRE, 1st T20I: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వర్షం అడ్డురావడంతో డర్క్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్టోయ్ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. అయితే ఒక వికెట్ తీసుకున్న అర్ష్‌దీప్ సింగ్ మాత్రం బౌలింగ్ దిగ్గజాలు ఉన్న ఓ చెత్త లిస్టులోకి చేరాడు.దిగ్గజ బౌలర్లను కలిగిన ఆ చెత్త లిస్టు ఏమిటో.. అర్ష్‌దీప్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 19, 2023 | 4:14 PM

IND vs IRE, 1st T20I: భారత్, ఐర్లాండ్ మధ్య శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. అయితే ఈ క్రమంలో అర్ష్‌దీప్ ఓ నో బాల్ కూడా వేశాడు. ఇదే అతన్ని చెత్త రికార్డ్‌ల్లో నిలిచేలా చేసింది.

ఐర్లాండ్‌పై అర్ష్‌దీప్ వేసిన ఆ నో బాల్ అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 16వ నో బాల్. దీంతో అతను అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా నో బాల్స్ వేసిన మూడో ప్లేయర్‌గా అవతరించాడు. అ మ్యాచ్‌కి ముందు ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ ఉండేవాడు.

అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా నో బాల్స్ వేసిన ఆటగాడిగా సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నే మోర్కెల్ ఉన్నాడు. మోర్కెల్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 19 నో బాల్స్ వేసి ఈ చెత్త రికార్డ్‌ను మోస్తున్నాడు.

మోర్కెల్ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ రెండో స్థానంలో ఉన్నాడు. బ్రెట్ లీ మొత్తం 17 నో బాల్స్ వేశాడు.

అర్ష్‌దీప్ 17 నో బాల్స్‌తో మూడో స్థానానికి చేరుకోవడంతో.. ఆ స్థానంలో ఇంతక ముందు ఉన్న మలింగ నాల్గో స్థానానికి పడిపోయాడు. మలింగ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో మొత్తం 14 నో బాల్స్ వేశాడు.





























