- Telugu News Photo Gallery Cricket photos Jasprit Bumrah 1st Indian to claim the Player of the Match award on T20I debut as captain and took 2 wickets in 1st over
IND vs IRE: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. స్పెషల్ జాబితాలో చోటు..
Jasprit Bumrah: టీమ్‌ఇండియా తరపున రీఎంట్రీ ఇచ్చి తొలి ఓవర్ విసిరిన బుమ్రా 2 వికెట్లు తీశాడు. తొలి ఓవర్‌లో కేవలం 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో తాను సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.
Updated on: Aug 19, 2023 | 9:33 AM

ఐర్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. టీమిండియాకు 140 పరుగుల సవాల్ విసిరింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కారణంగా మ్యాచ్‌ను సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు వర్షం ఆగకపోవడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీతో పాటు సరిగ్గా 11 నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

నిజానికి టీమిండియా తరపున మొదట అటాక్ చేసిన బుమ్రా.. తొలి ఓవర్ లోనే 2 వికెట్లు పడగొట్టాడు. ఆ ఓవర్ తొలి బంతికి ఆండీ బల్బిర్నీ బౌండరీ బాదాడు. ఆ తర్వాత బుమ్రా తన రెండో బంతికి బల్బిర్నీ వికెట్ పడగొట్టడంలో సఫలమయ్యాడు.

ఆ తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి లోర్కాన్ టక్కర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. తొలి ఓవర్‌లో కేవలం 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

దీంతో తాను సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

సెప్టెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కారణంగా బుమ్రా గత 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీని కారణంగా, బుమ్రా T20 ప్రపంచ కప్, IPL, WTC ఫైనల్‌లో కూడా ఆడలేదు.

ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా తన నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.




