- Telugu News Photo Gallery Cricket photos Rohit sharma follows virat kohli captaincy ms dhoni best skipper says shoaib akhtar
Team India: కోహ్లీ బాటలోనే రోహిత్.. వారిద్దరి కెప్టెన్సీలో అతిపెద్ద లోపం ఇదే.. పాక్ మాజీ ప్లేయర్ కీలక వాఖ్యలు
Rohit Sharma-Virat Kohli: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని కీలక లోపాలను ఎత్తి చూపాడు. రోహిత్, విరాట్‌ల కంటే ధోనీ చాలా గొప్పవాడంటూ షోయబ్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాలు కూడా వివరించాడు. వీటిని అధిగమిస్తేనే వారు అద్బుతమైన సారథుల లిస్టులో చేరతారంటూ చెప్పుకొచ్చాడు.
Updated on: Aug 19, 2023 | 8:12 AM

షోయబ్ అక్తర్ బౌలింగ్‌లోనే కాకుండా వాక్చాతుర్యంతో కూడా గుర్తింపు పొందాడు. ఈ కారణంగా మరోసారి షోయబ్ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై షోయబ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ అద్భుతమైన వ్యక్తి అని షోయబ్ అక్తర్ అన్నాడు. కానీ, చాలా సందర్భాలలో భయాందోళనలకు గురవుతుంటారు. ఆ సమయంలో చాలా బాధగా కనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ తన సొంత ఆటగాళ్లపై చాలాసార్లు అరుస్తూ కనిపిస్తాడంటూ చెప్పుకొచ్చాడు.

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీతో సమస్య ఏమిటంటే అతను చాలా దూకుడుగా కనిపిస్తాడు. కానీ, ధోనీ కెప్టెన్సీని మాత్రం కొనియాడాడు.

ధోనీ అలాంటి కెప్టెన్ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. జట్టు మొత్తాన్ని తన వెనకే దాచుకునేవాడు.

ఇది కాకుండా షోయబ్ అక్తర్ భారత జట్టుపై నిరంతరం చర్చలు జరుగుతున్నందున వారిపై ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చాడు. టీమిండియా ఎప్పటికీ ఓడిపోలేని విధంగా తయారు చేశాడని, ఇది పాకిస్తాన్ జట్టుపై ఒత్తిడిని తగ్గిస్తుందంటూ చెప్పుకొచ్చాడు.





























