- Telugu News Photo Gallery Cricket photos Jasprit Bumrah Becomes India's 9th player to get victory in 1st match as T20I Team captain
IND vs IRE: బూమ్రా ఖాతాలో కోహ్లీ, పంత్‌కి సాధ్యం కాని రికార్డ్.. టీ20 క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన భారత కెప్టెన్‌గా..
IND vs IRE 1st T20I: ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించడంతో ఐర్లాండ్ సిరీస్‌లో జస్ప్రీత్ బూమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బూమ్రా సారథ్యంలో ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బూమ్రా ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ చేరింది. అదేమిటంటే..
Updated on: Aug 19, 2023 | 9:14 PM

ఐర్లాండ్‌పై తొలి టీ20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో భారత్ సాధించిన విజయం, కెప్టెన్‌గా బూమ్రాకి ఫస్ట్ మ్యాచ్. ఇలా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధంచిన బూమ్రా భారత్ తరఫున ఆ ఘనత సాధించిన 9వ టీ20 కెప్టెన్‌గా అవతరించాడు.

నిజానికి బూమ్రా భారత టీ20 జట్టుకు 11వ కెప్టెన్. అంటే భారత్ టీ20 జట్టుకు సారథ్యం వహించిన వారిలో బూమ్రాతో సహా మొత్తం 9 మంది మాత్రమే కెప్టెన్‌గా తమ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించారు.

ఇలా విజయం సాధించినవారి లిస్టులో బూమ్రా 9వ కెప్టెన్ కాగా.. అతని కంటే ముందు విరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఉన్నారు.

మరి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా తమ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్ ఓడిపోయాడు. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

2022లో సౌతాఫ్రికా టూర్ కోసం వెళ్లిన టీమిండియాను రిషభ్ పంత్ నడిపించాడు. అయితే పంత్ కూడా కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయాడు.




