Hashish: వారం రోజులుగా తీరప్రాంతాలకు కొట్టుకొస్తున్న భారీ ప్యాకెట్లు.. ఎంటా అని తెరిచిచూడగా..

గత వారం రోజులుగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో తీర ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు కొట్టుకొస్తున్నాయి. ఆరు రోజుల్లో మొత్తం 7 తీర ప్రాంతాలకు డ్రగ్స్‌ పెద్ద మొత్తంలో కొట్టుకొచ్చాయి. గత ఆరు రోజుల్లో 250 కేజీలకు పైగా హశీష్‌ అనే డ్రగ్స్‌ను కస్టమ్స్‌ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం (ఆగస్టు 21) వెల్లడించారు. ఆగస్టు 14 నుంచి 19వ తేదీ వరకు కర్దే, లద్ఘర్‌, కెల్షి, కొల్తారే, మురుద్‌, బురోంది, బోరియా బీచ్‌లు, దభోల్‌ క్రీక్‌ బీచుల నుంచి ఈ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ నుంచి ఈ డ్రగ్స్‌ వచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు..

Hashish: వారం రోజులుగా తీరప్రాంతాలకు కొట్టుకొస్తున్న భారీ ప్యాకెట్లు.. ఎంటా అని తెరిచిచూడగా..
Drugs Washed Up On Maharashtra Beaches
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 22, 2023 | 12:33 PM

ముంబయి, ఆగస్టు 22: గత వారం రోజులుగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో తీర ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు కొట్టుకొస్తున్నాయి. ఆరు రోజుల్లో మొత్తం 7 తీర ప్రాంతాలకు డ్రగ్స్‌ పెద్ద మొత్తంలో కొట్టుకొచ్చాయి. గత ఆరు రోజుల్లో 250 కేజీలకు పైగా హశీష్‌ అనే డ్రగ్స్‌ను కస్టమ్స్‌ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం (ఆగస్టు 21) వెల్లడించారు. ఆగస్టు 14 నుంచి 19వ తేదీ వరకు కర్దే, లద్ఘర్‌, కెల్షి, కొల్తారే, మురుద్‌, బురోంది, బోరియా బీచ్‌లు, దభోల్‌ క్రీక్‌ బీచుల నుంచి ఈ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ నుంచి ఈ డ్రగ్స్‌ వచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ సరుకు విదేశీ నౌకల నుంచి పొరపాటున పడిపోవడం లేదా ఎవరైనా పడవేశారా అనే కోణంలో కస్టమ్స్ విభాగం అనుమానిస్తున్నారు.

దపోలీ కస్టమ్స్ విభాగానికి చెందిన అధికారులు ఆగస్టు 14న కరాడే బీచ్‌లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో 12 కిలోల బరువున్న 10 అనుమానాస్పద ప్యాకెట్లు బీచ్‌ ఒడ్డున కనుగొన్నారు. వీటిని ల్యాబొరేటరీలో పరీక్ష చేయగా హషీష్ అనే డ్రగ్స్‌గా అధికారులు గుర్తించారు. సరిగ్గా ఇదే విధంగా ఆగస్టు 15వ తేదీన కూడా కర్డే, లద్ఘర్ బీచ్‌ల మధ్యలో 35 కిలోల డ్రగ్స్‌ దొరికాయి. ఇక ఆ మరుసటి రోజు ఆగస్టు 16ర కెల్షి బీచ్‌లో 25 కిలోల డ్రగ్స్, కోల్‌తారే బీచ్‌లో13 కిలోల హశీష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్ట్ 17న మురుద్ తీర ప్రాంతంలో 14 కిలోలకుపైగా డ్రగ్స్‌ దొరికాయి. ఇక బురోండి – దభోల్ క్రీక్ బీచ్‌ల మధ్యలో ఉన్న తీర ప్రాంతంలో 101 కిలోలు డ్రగ్స్‌, బోరియా బీచ్ నుంచి 22 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఇలా గత సోమవారం నుంచి శనివారం వరకు వరుసగా ఆరు రోజులపాటు ఏడు బీచ్‌లలో లభించిన ఏకంగా 250 కిలోలకు పైగా హశీష్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో ఇంకా సర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోందనిని డాపోలి కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ కుడాల్కర్ మీడియాకు తెలిపారు. తీర ప్రాంతాల వెంబడి నివసించే ప్రజలు డ్రగ్స్‌తో కూడిన అనుమానిత బ్యాగులు ఏవైనా కనుగొంటే వెంటనే తమను సంప్రదించాలని కుడాల్కర్ విజ్ఞప్తి చేశారు. తీరప్రాంతం వెంబడి కొట్టుకొచ్చే ఇలాంటి మాదక ద్రవ్యాలను ఎవరైనా స్వాధీనం చేసుకున్నట్లు తేలితే వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కఠిన శిక్ష విధిస్తామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.