Sunny Deol: విల్లా వివాదంపై స్పందించిన సన్నీ డియోల్‌.. ఏమన్నారంటే

ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్ 2 చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు సన్నీ డియోల్. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆధారణ రావడంతో 400 కోట్ల రూపాయల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సన్నీ డియోల్ విల్లా వివాదం చర్చనీయాంశమవుతోంది.

Sunny Deol: విల్లా వివాదంపై స్పందించిన సన్నీ డియోల్‌.. ఏమన్నారంటే
Sunny Deol
Follow us
Aravind B

|

Updated on: Aug 22, 2023 | 11:48 AM

ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్ 2 చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు సన్నీ డియోల్. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆధారణ రావడంతో 400 కోట్ల రూపాయల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సన్నీ డియోల్ విల్లా వివాదం చర్చనీయాంశమవుతోంది. సన్నీ డియోల్ ముంబయిలోని జుహులో తన విల్లా వివాదంతో ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంకుకు సన్నీ డియోల్ దాదాపు 56 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారన్న విషయం తెలియండంతో సంచలనం రేపింది. అయితే ఈ బ్యాంకుకు సన్నీ డియోల్ 56 కోట్లు అప్పు కట్టాల్సి ఉండగా వాటిని వసులు చేసేందుకు బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలోనే ముంబైలోని జుహులో సన్నీ డియోల్ లగ్జరీ విల్లాను బ్యాంక్ ఆఫ్ బరోడా వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సన్నీ డియోల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా అనూహ్యంగా ఆ వేలం నోటీసులను బ్యాంకు ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఈ అంశం మరింత చర్చనీయంగా మారింది. తాజాగా దీనిపై నటుడు సన్నీ డియోల్ కూడా స్పందించాడు. ఇది తన వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడాలని అనుకోవడం లేదని అన్నాడు. ఇవన్నీ కూడా తన వ్యక్తిగత విషయాలని.. ఇప్పుడు తాను ఏం చెప్పినా కూడా ప్రజలు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని అన్నారు. అందుకోసమే ఈ విషయంపై మాట్లాడడం ఇష్టం లేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా 2022 డిసెంబర్ నంచి సన్ని డియోల్.. జరిమానా, వడ్డితో సహా మొత్తం రూ.59.99 కోట్ల రుణం బాకీ పడ్డారని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన విల్లాను రూ.51.43 కోట్ల రిజర్వ్ ధరకు ఈ నెల 25న ఈ వేలం వేయనున్నట్లు బ్యాంకు ఆదివారం నోటీసులు ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాకయ్యారు. అలాగే విల్లాతో సహా.. 599.44 చదరపు మీటర్లలో ఉన్నటువంటి సన్నీ డియోల్‌, ఆయనకు వ్యక్తిగత గ్యారంటీదారుగా ఉన్న అతని తండ్రి ధర్మేంద్రకు చెందిన భవనాలను సైతం వేలంలో వేస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే 24 గంటలు గడవక ముందే ఈ వేలానికి సంబంధించిన నోటీసును బ్యాంకు వెనక్కి తీసుకుంది. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఏం జరగనుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!