‘నాన్న నేను బతికే ఉన్నాను’.. దహనం చేసిన తండ్రికి కూతురు వీడియో కాల్! షాక్‌లో తల్లిదండ్రులు, పోలీసులు..!!
కూతురు మృతదేహాన్ని చూసి తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి..అంత్యక్రియలు నిర్వహించారు. మిస్సైన అనూష డెడ్ బాడీ దొరికిందన్న వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ వార్త జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపింది. కూతురి ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు ఆమెను హత్య చేసి కాల్వలో పడేశారు. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించిన అసలు సమాచారం తెలియడంతో యువతి తల్లిదండ్రులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
కూతురికి అంత్యక్రియలు నిర్వహించి బరువెక్కిన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రికి ఆశ్చర్యం, షాక్ ఎదురయ్యాయి! కూతురు తన తండ్రి సెల్‌ఫోన్‌కు వీడియో కాల్ చేసి, ‘నాన్నా నేను బతికే ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను’ అని చెప్పింది! వీడియో కాల్‌లో కూతురి ముఖం చూసి ఆ తండ్రి కళ్లలో ఆనందం వర్ణనాతీతంగా మారింది. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లోని పూర్నియా జిల్లా అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక అనూషా కుమారి అనే యువతి గత కొద్ది రోజుల క్రితం అదృశ్యమైంది. నెల రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి కోసం తల్లిదండ్రులు అంతా గాలించారు. చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు యువతి కోసం వెతికారు. అయితే అనూష ఆచూకీ లభించలేదు.
కొద్ది రోజుల క్రితం పూర్ణియా తర్వాత కాలువలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై అనూష వేసుకున్న బట్టలు పోలి ఉన్నాయి. మృతదేహం ముఖం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. కాలువలో లభించిన మృతదేహం అనూషను పోలి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు అది తమ కూతురిదేనని అంగీకరించారు. కూతురు మృతదేహాన్ని చూసి తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి..అంత్యక్రియలు నిర్వహించారు. మిస్సైన అనూష డెడ్ బాడీ దొరికిందన్న వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ వార్త బతికున్న అనూషకు కూడా చేరింది!
ప్రేమికుడితో పారిపోయిన అనూష!..
అనూష చనిపోయిందని, కాలువలో కనిపించిన మృతదేహం అనూషదేనని భావించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేశారనే వార్త వ్యాపించడంతో అనూష ఆందోళనకు గురైంది. వెంటనే ఆలస్యం చేయకుండా తన తండ్రికి వీడియో కాల్ చేసింది.
కూతురు చనిపోయిందని భావించిన తండ్రి వీడియో కాల్‌లో ఆమె ముఖం చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ‘నాన్నా నేను బతికే ఉన్నాను’ అని కూతురు అనడంతో ఆ తండ్రి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. నువ్వెక్కడ ఉన్నావు..ఏం చేస్తున్నావు అని తండ్రి ప్రశ్నించగా.. ప్రేమికుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయానని చెప్పింది. తనకు ఇప్పటికే ప్రేమించిన వ్యక్తితో వివాహమై అత్తగారింట్లో సంతోషంగా ఉంటున్నట్లుగా చెప్పింది. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని జానకి నగర్ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తున్నట్లు అనూష తెలిపింది. అనంతరం అనూష తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సూరజ్ ప్రసాద్ కూడా అనూష మొబైల్‌కు వీడియో కాల్ చేశారు. యువతి క్షేమంగా ఉందని, భర్త, అత్తగారి ఇంటి వద్ద సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు.
ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది?
అనూష మృతదేహంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అది అనూష మృతదేహం కాదని తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో స్థానికంగా జరిగిన ఓ పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కూతురి ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు ఆమెను హత్య చేసి కాల్వలో పడేశారు. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించిన అసలు సమాచారం తెలియడంతో యువతి తల్లిదండ్రులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..