AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహ బాధితులకు అమృతం వంటిది ఈ కూరగాయ.. పూర్తి కంట్రోల్‌లో బ్లడ్‌ షుగర్‌..! ఇంకా..

ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. దీంతో ఎముకలు బలపడతాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు ఈ కూరగాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను సరిచేయడంలో సహాయపడుతుంది. చర్మ సమస్య తామర నుండి ఉపశమనాన్ని కలిగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గాయాలు నయం చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

మధుమేహ బాధితులకు అమృతం వంటిది ఈ కూరగాయ.. పూర్తి కంట్రోల్‌లో బ్లడ్‌ షుగర్‌..! ఇంకా..
Vegetables
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2023 | 5:15 PM

Share

దొండకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొద్దిపాటి అజాగ్రత్త వల్ల షుగర్‌ బాధితులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వారు ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొన్ని కూరగాయలు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. వీటిలో ఒకటి దొండకాయ. ఇది షుగర్ పేషెంట్లకు అమృతం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

Ivy Gourd

దొండకాయ బ్లడ్ షుగర్‌ని నియంత్రిస్తుంది:

దొండకాయ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దొండకాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అనేక పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డయాబెటిస్‌ బాధితులు మందులు కాకుండా రోజూ 50 గ్రాముల దొండకాయ తినాలి. ఇది చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.. దొండకాయలో డైటరీ ఫైబర్ ఉంటుంది. దొండకాయ తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దొండకాయ గుండెకు మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దొండకాయను తరచూగా తింటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఎముకలను దృఢంగా చేస్తుంది.. కూరగాయల్లో దొండకాయ ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.దొండకాయ తినటం వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఖచ్చితంగా దొండకాయ తినాలి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. దొండకాయ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఉన్నందున రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనితో పాటు దొండకాయ శరీర బరువును నియంత్రించడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు దొండకాయ ఔషధంగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను సరిచేయడంలో సహాయపడుతుంది. చర్మ సమస్య తామర నుండి ఉపశమనాన్ని కలిగించడంలో దొండకాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది. గాయం నయం చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..