రోడ్డు మీద దొరికిన డబ్బు మంచిదా చెడ్డదా..! దేనికి సంకేతం..? తీసుకునే ముందు తప్పక తెలుసుకోండి..

హిందూ మతంలో ప్రతిదానికీ నియమాలు రూపొందించబడ్డాయి. మీరు వెళ్తున్న రోడ్డు మీద డబ్బు దొరికినా కూడా దానికి కొన్ని శుభ, అశుభ సంకేతాలను సూచిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మనం రోడ్డు మీద దొరికే డబ్బు శుభానికి సంకేతమా..? లేదంటే అశుభ సంకేతమా తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Aug 21, 2023 | 4:09 PM

సాధారణంగా మనకు అప్పుడప్పుడు రోడ్డుపై వెళ్తుండగా కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి. మరికొన్ని సార్లు నోట్లు కూడా కనిపిస్తాయి. ఇలా అనుకోకుండా రోడ్డుపై కనిపించిన డబ్బు  తీసుకోవడానికి మనం చాలా ఆలోచిస్తుంటాం. మరికొందరు మాత్రం ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆ డబ్బు తీసుకుని జేబులో వేసుకుంటారు.

1 / 5
జ్యోతిష్యం ప్రకారం, డబ్బు, నాణేలు రోడ్డుపై పడి ఉంటే శుభప్రదంగా భావిస్తారు. మీరు పడిపోయిన నాణేలను చూస్తే, మీరు మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందారని అర్థం. విశ్వాసాల ప్రకారం మరొక సంకేతం ఏమిటంటే, మీరు రోడ్డుపై పడి ఉన్న నాణేలను తీసుకుంటే, మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారని అర్థం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు పని నుండి బయలుదేరేటప్పుడు మార్గంలో నోటు లేదా నాణెం కనిపిస్తే, మీరు మీ పనిలో విజయం సాధిస్తారని అర్థం. మీరు పని నుండి తిరిగి వస్తుంటే, డబ్బు రోడ్డుపై పడి ఉంటే మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం.

3 / 5
ఈ డబ్బు ఖర్చు చేయకూడదు. ఇది ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. రోడ్డు మీద దొరికిన డబ్బులను తీసుకోవటంవల్ల ఆ డబ్బు పోగొట్టుకున్న వారి ఆవేదన, బాధ మనకు కలుగుతాయని భావిస్తారు.. అందుకోసమే రోడ్డుపై దొరికిన డబ్బును ఏదైనా ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. ఆ డబ్బులను దేవుని సన్నిధిలో వేసి ఆ డబ్బు పోగొట్టుకున్న వారికి మంచి జరగాలని మాత్రమే ప్రార్థించాలి.

4 / 5
రోడ్డుపై దొరికిన నాణెం త్వరలో మీ జీవితంలో మంచి జరగబోతోందనడానికి సంకేతం. మీరు ప్రతి పనిలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఇలా దొరికన డబ్బు.. మీరు త్వరలో కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని కూడా ఇది సూచిస్తుంది. నాణెం, వెండి, బంగారం దొరికినట్టయితే.. అది మీపై దైవానుగ్రహానికి సంకేతంగా చెబుతారు.

5 / 5
Follow us