బహిష్టు నొప్పి నివారణకు అల్లం.. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా వాడితే అద్భుత ఔషధం..

ఖాళీ కడుపుతో అల్లం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బహిష్టు సమయంలో మహిళలు తీవ్రమైన కడుపు నొప్పిని అనుభవిస్తుంటారు.ఖాళీ కడుపుతో అల్లం తినడం వల్ల ఈ సమస్యకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇంకా మన శరీరానికి అల్లం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

|

Updated on: Aug 21, 2023 | 3:09 PM

అల్లం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థం. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అల్లంతో టీ, చట్నీ, తొక్కు, రసం ఇలా అనేక రకాల వంటకాలను వంటకాలను తయారు చేసుకోవచ్చు. అల్లం తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మానవ శరీరానికి చాలా మేలు చేస్తాయి.

1 / 6
బరువు తగ్గడంలో కూడా అల్లం కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని మీకు తెలుసా? ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగిస్తాయి. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి తగ్గుతుంది. కొవ్వు కరిగిపోతుంది.

2 / 6
అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో అల్లం తినడం వల్ల శరీరం, కండరాలలో ఒత్తిడి తగ్గుతుంది. అల్లం రుతుక్రమంలో వచ్చే నొప్పులను కొంత వరకు తగ్గిస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది. బహిష్టు సమయంలో ప్రత్యేక పద్ధతిలో అల్లం తినటం మేలు చేస్తుంది. ఇందుకోసం ఒక అంగుళం అల్లం తీసుకుని వేడిచేసిన తర్వాత నమలి మింగేయాలి.. ఇది మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

3 / 6
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తం గడ్డకట్టడం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మీరు మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ఖాళీ కడుపుతో అల్లం రసం తాగినా, అల్లాన్ని నమలి తిన్నా ఇది మీకు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.

4 / 6
మెరిసే చర్మం కావాలంటే రోజూ గోరువెచ్చని నీటిలో అల్లం తీసుకోవాలి. ఇది మీ చర్మాన్ని మచ్చలు లేకుండా ఉంచుతుంది. మీ చర్మం మెరిసేలా చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాలు ఉన్నాయి.

5 / 6
 ఇది మీ శరీరంలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది. ఈ లక్షణాల కారణంగా, ఆర్థరైటిస్ రోగులు ఖాళీ కడుపుతో అల్లం తినడం మంచిది. ఆర్థరైటిస్ రోగులు రోజూ ఖాళీ కడుపుతో అల్లం లేదా అల్లం నీటిని తాగితే వారికి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
Follow us