- Telugu News Photo Gallery Cinema photos Heroine kavya kalyanram interesting comments about allu arjun
Kavya Kalyan Ram: అల్లు అర్జున్‌కు నో చెప్పిన బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.. కానీ
అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Updated on: Aug 21, 2023 | 1:23 PM

కావ్య కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిది. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది కావ్య కళ్యాణ్ రామ్. చాలా సినిమాల్లో ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

ఇక ఈ అమ్మడు రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గంగోత్రి సినిమా సమయంలో అల్లు అర్జున్ కావ్యను నా పక్కన హీరోయిన్ గా నటిస్తావా అని అడిగారట. అయితే నేను హీరోయిన్ అయ్యే లోపు మీరందరూ ముసలోళ్ళు అవుతారు అని అన్నదట.

అయితే ఇప్పుడు నేను హీరోయిన్ గా మారాను కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారు అని చెప్పి నవ్వేసింది కావ్య. మరి ఈ అమ్మడు ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి హీరోయిన్ గా చేస్తుందేమో చూడాలి.





























