Curry with Rava: రవ్వతో ఉప్మానే కాదు.. కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా?
బొంబాయి రవ్వ.. ఉప్మారవ్వ.. తెల్ల ఉప్మారవ్వ.. ఎలా పిలిచినా .. ఈ రవ్వతో చేసే వంటకాలు ఏంటి ? అనగానే మొదట గుర్తొచ్చేది ఉప్మా. ఆ తర్వాత పానీపూరి, పూరీలు గుర్తొస్తాయి. కానీ రవ్వతో కర్రీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా ? ఏంటి షాక్ అయ్యారా? నిజమే. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ కర్రీకి ఏయే పదార్థాలు కావాలి ? ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
బొంబాయి రవ్వ.. ఉప్మారవ్వ.. తెల్ల ఉప్మారవ్వ.. ఎలా పిలిచినా .. ఈ రవ్వతో చేసే వంటకాలు ఏంటి ? అనగానే మొదట గుర్తొచ్చేది ఉప్మా. ఆ తర్వాత పానీపూరి, పూరీలు గుర్తొస్తాయి. కానీ రవ్వతో కర్రీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా ? ఏంటి షాక్ అయ్యారా? నిజమే. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ కర్రీకి ఏయే పదార్థాలు కావాలి ? ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
రవ్వ కర్రీకి కావలసిన పదార్థాలు:
నూనె – 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క – చిన్నది, లవంగాలు -2, యాలకులు -2, జీలకర్ర – 1/2టీ స్పూన్, ఆవాలు – 1/2టీ స్పూన్, మెంతులు – 1/4టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ-1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, పసుపు – 1/4టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, ధనియాలపొడి – 1 టీస్పూన్, టమాటాలు -2, చిలికిన పెరుగు – 1/4 కప్పు, నీళ్లు – 2 గ్లాసులు, తరిగిన కొత్తిమీర కొద్దిగా
రవ్వ బాల్స్ తయారీకి కావలసిన పదార్థాలు:
బొంబాయిరవ్వ – 1. 1/4 కప్పు, శనగపిండి – 1/2 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ-1, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ధనియాలపొడి – 1/2 టీ స్పూన్, కారం -1/2 టీ స్పూన్, ఉప్పు – 1/2 టీ స్పూన్, గరం మసాలాపొడి – 1/2 టీ స్పూన్, డీప్ ఫ్రై కు సరిపడా నూనె.
తయారీ విధానం:
ఒక గిన్నెలో రవ్వను తీసుకుని నూనె మినహా.. రవ్వబాల్స్ తయారీకి చెప్పిన మిగతా అన్ని పదార్థాలు వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ పిండిముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. దీనిపై మూతపెట్టి 1/2 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు రవ్వను కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. కళాయిలో నూనెపోసి.. అది వేడయ్యాక రవ్వబాల్స్ ను వేసి వేయించుకోవాలి. 70 శాతం బాల్స్ ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు మరోపాత్రలో నూనెపోసి వేడయ్యాక.. మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయముక్కలు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలుపుకోవాలి. ఒకనిమిషం వేగిన తర్వాత.. టమాటా ఫ్యూరీ వేసి కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత మంటను తగ్గించి పెరుగు వేసి కలుపుకోవాలి. నూనె పైకి తేలేంతవరకూ మొత్తం ఫ్రై చేసి.. తర్వాత నీళ్లుపోసి ఉడికించాలి. మరుగుతున్న ఈ మిశ్రమంలో రవ్వ బాల్స్ వేసి కలపాలి. మూత పెట్టి 10-12నిమిషాల పాటు ఉడికించి.. కొత్తిమీర చల్లుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వకర్రీ రెడీ. దీనిని అన్నం, చపాతి, రోటీలలో తినొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి