Tulsi Benefits: పరగడుపున తులసి ఆకులు తింటే ఇన్ని ప్రయోజనాలా!!
చర్మం, జుట్టు సమస్యలకు కూడా తులసి ఆకులు ఎంతో బాగా పని చేస్తాయి. తులసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే తులసిని ఔషధ మొక్కల రాణి అని అంటారు. అయితే తులసి మొక్క ఇంట్లోనే ఉన్నా.. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలీదు. సాధారణంగా తులసి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ని తగ్గిస్తుంది. ఇవే కాకుండా తులసిని పరగడుపున తీసుంటే ఇంకా ఎలాంటి రోగాలకు దూరంగా ఉంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...
తులసిని హిందూ సంప్రదాయంలో ఒక దైవంగా భావిస్తారు. అందులోనూ ప్రత్యేకమైన పర్వ దినాల్లో మరింతగా పూజిస్తారు. సాధారణంగా హిందూ కుటుంబాల్లో తులసి మొక్క లేని ఫ్యామిలీ ఉండదు. తులసి చెట్టు గాలి తగిలినా సగం రోగాలను నయం చేసుకోవచ్చు. అంత శక్తి తులసి మొక్కు ఉంది. అందుకే తులసిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తూంటారు. తులసితో అనేక వ్యాధులకు, రోగాకు చెక్ పెట్టవచ్చు.
చర్మం, జుట్టు సమస్యలకు కూడా తులసి ఆకులు ఎంతో బాగా పని చేస్తాయి. తులసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే తులసిని ఔషధ మొక్కల రాణి అని అంటారు. అయితే తులసి మొక్క ఇంట్లోనే ఉన్నా.. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలీదు. సాధారణంగా తులసి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ని తగ్గిస్తుంది. ఇవే కాకుండా తులసిని పరగడుపున తీసుంటే ఇంకా ఎలాంటి రోగాలకు దూరంగా ఉంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వంటల్లో ఉపయోగించవచ్చు:
తులసి ఆకులను కూరగాయలతో పాటు కలిపి వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల మనం వండుకున్న ఆహారానికి.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను జోడిస్తుంది.
రోగ నిరోధక శక్తి:
తులసి ఆకుల్లో ఇమ్యునోమోడ్యులేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అలర్జిని తగ్గిస్తుంది. శరీర వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఆర్థరైటీస్:
తులసిలోని యూజినాల్ అనే పదార్థం ఆర్థరైటీస్ నొప్పి, వాపుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వుని కరిగించి బరువుని తగ్గిస్తుంది.
అలర్జీ:
తులసి ముఖ్యంగా అలర్జీని దరిచేరనివ్వదు. ఇందులో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం అలర్జీని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
డయాబెటీస్:
టైప్-2 డయాబెటీస్ తో బాధపడేవారికి చక్కని ఔషధంలా పని చేస్తుంది తులసి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటే మంచింది.
గుండె సమస్యలని దరిచేరనివ్వదు:
తులసిలోని ఉండే యూజినాల్ కొలెస్ట్రాని తగ్గించి గుండె స్పందన రేటును కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. తులసిని ప్రతి రోజూ తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇమ్యునిటీ బూస్ట్:
తులసి శరీరానికి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ లా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిని రాకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి