AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cycling Benefits: ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే మీ శరీరంలో ఎన్నిమార్పులొస్తాయో తెలుసా?

సైక్లింగ్ అనగానే.. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయ్ కదూ.. ఉదయాన్నే అమ్మ రెడీ చేసిన క్యారేజీ బాక్సు, వాటర్ బాటిల్ పట్టుకుని.. స్కూల్ బ్యాగ్ తగిలించుకుని.. అలా స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కుతూ స్కూలుకెళ్లే రోజులు గుర్తొచ్చే ఉంటాయి. చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా.. నడుస్తూ, పరిగెత్తుతూ, ఆడుతూ, సైకిల్ తొక్కుతూ ఇలా శరీరంలో ఏదొక కదలిక ఉంటూనే ఉండేది కాబట్టి ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు. మరి ఇప్పుడో ? గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడమే పనైపోయింది. మనమే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువ కదలికలు..

Cycling Benefits: ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే మీ శరీరంలో ఎన్నిమార్పులొస్తాయో తెలుసా?
Morning Exercise Cycling
Follow us
Chinni Enni

|

Updated on: Aug 20, 2023 | 7:11 PM

సైక్లింగ్ అనగానే.. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయ్ కదూ.. ఉదయాన్నే అమ్మ రెడీ చేసిన క్యారేజీ బాక్సు, వాటర్ బాటిల్ పట్టుకుని.. స్కూల్ బ్యాగ్ తగిలించుకుని.. అలా స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కుతూ స్కూలుకెళ్లే రోజులు గుర్తొచ్చే ఉంటాయి. చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా.. నడుస్తూ, పరిగెత్తుతూ, ఆడుతూ, సైకిల్ తొక్కుతూ ఇలా శరీరంలో ఏదొక కదలిక ఉంటూనే ఉండేది కాబట్టి ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు. మరి ఇప్పుడో ? గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడమే పనైపోయింది. మనమే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువ కదలికలు ఉండటం లేదు. స్కూల్ కి వెళ్లాలంటే బస్ లేదా ఆటో.

అందుకే చిన్న వయసులోనే రాకూడని రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. ప్రతిరోజూ వ్యాయామంతో పాటు ఒక గంట సైక్లింగ్ చేస్తే శరీరంలో చాలా మార్పులొస్తాయి. శరీరం ఎక్కువగా అలసిపోకుండా ఉంటుంది. గుండెపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే.. శరీరంలో పాదాల నుంచి ప్రతి అవయవంలో కదలిక వస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది. తొడల భాగంలో పేరుకున్న కొవ్వు కరిగి.. మోకాళ్లకు కూడా చక్కటి వ్యాయామం అవుతుంది. బరువు సులభంగా తగ్గవచ్చు.

మోకాళ్లనొప్పులు, పిక్కల నొప్పులతో బాధపడేవారు సైక్లింగ్ చేస్తే రక్తప్రసరణ మెరుగై నొప్పులు తగ్గుతాయి. వెరికోన్స్ వీన్స్ (నరాల వాపులు) సమస్యలతో బాధపడేవారికి సైక్లింగ్ మంచి వ్యాయామం. సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లలో కండరాలు బలపడి రక్తం సరఫరా అవుతుంది. మెడనొప్పి, నడుమునొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ సమస్య ఉన్నవారు సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ను నిరోధించే శక్తి తగ్గి.. ఇన్సులిన్ ను స్వీకరించే శక్తి పెరుగుతుంది. మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు సైక్లింగ్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. రోజూ సైక్లింగ్ చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయి. హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. సైక్లింగ్ చేయాలంటే ఇప్పుడు అర్జంటుగా రోడ్డుపైనే తొక్కాలని లేదు. ఇంట్లోనే ఒక ప్రదేశంలో ఫిట్ చేసుకునే సైకిల్స్ మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే సైక్లింగ్ చేస్తూ.. ఈ బెనిఫిట్స్ అన్నింటినీ పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి