Telugu News Photo Gallery Excessive yawning can be a warning sign of these health problems including heart attack
Yawning: అతిగా ఆవలించడం కూడా గుండెపోటు సంకేతమే.. ఇంకా ఏయే సమస్యలకు ఇది లక్షణం అంటే..!
Yawning: శరీరం అలసట లేదా విసుగు చెందినప్పుడు ఆవలింత రావడం సర్వసాధారణమైన లక్షణం. ఈ ఆవలింత అనేది తాత్కాలికంగా హృదయ స్పందన రేటు, శరీర చురుకుదనాన్ని పెంచే కొన్ని హార్మోన్ల కారణంగా వస్తుందని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా తన అధ్యాయనాల ద్వారా పేర్కొంది. అయితే ఓ వ్యక్తి 15 నిముషాల వ్యవధిలోనే 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆవలిస్తే అతనిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాట్లని కూడా సదరు యూనివర్సిటీ పేర్కొంది. విపరీతమైన ఆవలింత కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంభవిస్తుందని తెలిపింది. మరి ఆవలింతను లక్షణంగా కలిగిన ఆ సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం..