- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Placing these indoor plants in bedroom will bring freshness in life and reduces all type problems
Vastu Tips: బెడ్‌రూమ్‌లో ఇది ఉంటే ధన ప్రవాహం ఖాయం.. మీ ఒత్తిడి, ఆందోళన మాయం.. ఇంకా ఏయే ఫలితాలు ఉంటాయంటే..?
Bedroom Vastu: పడకగది ఇంట్లో అతి ముఖ్యమైన గది. అలసట, ఒత్తిడిని దూరం చేసుకునే స్థలం. అలాగే ఇంట్లో ఎక్కువ సమయం గడిపే చోటు. ఈ క్రమంలో పడకగది విషయంలో కొన్ని రకాల వాస్తు దోషాలను నివారించాలిన వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకోసం మీరు మీ పడకగదిలో కొన్ని రకాల మొక్కలను పెట్టుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా వాస్తు దోషాలను నివారిస్తుంది. మరి పడక గదిలో ఏయే మొక్కలను పెట్టుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 21, 2023 | 6:15 AM

Bedroom Vastu: పడకగదిలో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆందోళన, ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

లావెండర్ ప్లాంట్: లావెండర్ ఒక ఇండోర్ మొక్క కనుక దీని మెయింటనెన్స్ చాలా తేలిక. దీన్ని పడకగదిలో ఉంచితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని నుంచి వచ్చే సువాసన కూడా బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే బెడ్ రూమ్‌లోని గాలిని శుభ్రం చేస్తుంది.

రబ్బర్ ప్లాంట్: రబ్బర్ ప్లాంట్ కూడా ఇండోర్ ప్లాంట్, దీన్ని ఇంట్లో ఏ మూలన అయినా సులభంగా పెంచుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈ రబ్బర్ మొక్కను పడక గదికి ఆగ్నేయ దిశలో ఉంచాలి, తద్వారా ఆర్థిక పరిస్థితి, దాంపత్య జీవితం కూడా మెరుగుపడుతుంది.

లిల్లీ మొక్క: లిల్లీ మొక్క శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పడకగదిలో ఉంచితే చెడు కలలు తొలగి మంచి నిద్ర వస్తుంది. పడకగదిలో ఉంచడం వల్ల ఆర్ధిక రాబడికి సానుకూలత లభిస్తుంది.

మనీ ప్లాంట్: పడకగదిలో మనీ ప్లాంట్ ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదం. ఇది పడక గదిలో ఉంటే ఆ ఇంటికి ధన ప్రవాహం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.





























