- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips in Telugu: Aloe Vera Plant should be placed in this direction of the house
Vastu Tips for Aloe Vera: ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవడనికి కొన్ని నియమాలున్నాయి.. ఏ దిశలో పెంచుకోవాలంటే..
కలబంద మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. దీంతో ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకుంటారు. అయితే ఇతర మొక్కల మాదిరిగానే కలబందకు వాస్తు చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రంలో కలబంద ప్రాముఖ్యత గురించి, ఇంటి ఏ దిశలో పెంచుకోవడం వలన ప్రయోజనకరంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Aug 21, 2023 | 8:41 AM

కలబంద వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకే అందరి ఇళ్లలో కలబంద మొక్కను తులసి మొక్కలా పెంచుతారు. ఎందుకంటే కలబంద ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే.. కలబందను ఉపయోగించడం వల్ల ముఖానికి మెరుపు రావడమే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఆ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి.

కలబంద మొక్కను సరైన దిశలో నాటడం వల్ల సుఖ సంపదలు, అదృష్టం పెరుగుతుంది. అదే సమయంలో, ప్రతికూల శక్తి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది.. సానుకూల శక్తి ఇంటి అంతటా వ్యాపిస్తుందని విశ్వాసం.

కలబందను ఇంట్లో ఉంచడం వల్ల ప్రేమ, పురోభివృద్ధి, సంపద, ప్రమోషన్, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ మొక్క జీవితంలో వచ్చే కష్టాలను, పనిలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది.

వాస్తు ప్రకారం కలబంద మొక్కను సరైన దిశలో నాటడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఎవరైనా పని చేస్తున్న ప్రదేశంలో పురోగతిలో ఆటంకాలు ఏర్పడుతుంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

అంతేకాదు ఇంటి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను కూడా పెంచుకోవచ్చు. ఈ దిశ కలబంద నాటడానికి కూడా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.




