AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Immunity Food for Kids: మీ పిల్లలు బలంగా ఉండాలనుకుంటే ఈ సూపర్ ఫుడ్స్ ని తినిపించండి!!

పెళ్లి అయ్యేదాక ఒక లెక్క.. పిల్లలు ఉంటే మరో లెక్క. తల్లి కావాలని అనుకోని స్త్రీలు ఉండవు. తీరా పిల్లల్ని కన్నాక.. వారు బలహీనంగా, పేలవంగా ఉంటే ఆ తల్లి ఎంత బాధ పడుతుంటే చెప్పలేం. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో పిల్లలు తరుచూ వ్యాధుల బారిన పడటం ఖాయం. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులను తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. పెద్దల కన్నా చిన్నపిల్లల్లో ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వారు ఏది పడితే అవి తాకుతూ..

Best Immunity Food for Kids: మీ పిల్లలు బలంగా ఉండాలనుకుంటే ఈ సూపర్ ఫుడ్స్ ని తినిపించండి!!
Kids Food
Chinni Enni
|

Updated on: Aug 20, 2023 | 6:23 PM

Share

పెళ్లి అయ్యేదాక ఒక లెక్క.. పిల్లలు ఉంటే మరో లెక్క. తల్లి కావాలని అనుకోని స్త్రీలు ఉండవు. తీరా పిల్లల్ని కన్నాక.. వారు బలహీనంగా, పేలవంగా ఉంటే ఆ తల్లి ఎంత బాధ పడుతుంటే చెప్పలేం. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో పిల్లలు తరుచూ వ్యాధుల బారిన పడటం ఖాయం. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులను తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. పెద్దల కన్నా చిన్నపిల్లల్లో ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వారు ఏది పడితే అవి తాకుతూ ఉంటారు. మట్టిలో ఆడుతూ ఉంటారు. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్నింటినీ నోటిలో పెట్టుకుంటారు. కాబట్టి పిల్లలకు ఇమ్యునిటీ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. మరి ఆ ఆహారం ఏంటో.. ఎలా తీసుకుంటే మంచిదో.. ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో వారు రోగాల బారిన పడకుండా ఉంటారు.

పెరుగు: పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఫైబర్, పాలీ అన్ శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండాలి. అలాగే పిల్లలకు కూడా పెరుగును కూడా రెగ్యులర్ గా ఇస్తూ ఉండాలి. పెరుగు జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియాను పెంచుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

సీడ్స్: గుమ్మడి విత్తనాలు, పొత్తు తిరుగుడు, నువ్వులు, చియా సీడ్స్ కూడా రోజూ పిల్లలకు ఇస్తూండాలి.

ఇవి కూడా చదవండి

సిట్రస్ ఫ్రూట్స్: పిల్లలకు బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు, క్రాన్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు ఆహారంగా ఇవ్వాలి. ఇవి పిల్లల్లో ఇమ్యూనిటీని అమాంతం పెంచుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఎంతగానో సహాయపడతాయి. పుల్లగా ఉండే కివీ, దానిమ్మ, ద్రాక్ష, నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామ కాయల్లో కూడా ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.

కోడి గుడ్డు: అలాగే పిల్లలకు రోజూ ఒక కోడి గుడ్డు ఉడక బెట్టి ఇవ్వాలి. లేదంటే అమ్లెట్ అయినా పెట్టాలి. కోడిగుడ్లలో విటమిన్ డి, ఎ, బి 12 అధికంగా ఉంటాయి. దీని వల్ల వాళ్లలో నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది.

పాలు: పాలు కూడా పిల్లలో మంచి పోషణను అందిస్తాయి. వారిని ఎదిగేందుకు అవసరమైన కాల్షియంను అందిస్తుంది. దీంతో వారు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి, రోగాలు రాకుండా చూడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి