Sea Fish Benefits: సముద్రం చేపలు తింటే.. ఈ సమస్యలన్నీ మాయమవుతాయ్!!
ఆదివారం వచ్చిందంటే.. నాన్ వెజ్ ప్రియులకు పండగే. వారంలో ఆది, బుధవారాల్లో ఎక్కువగా నాన్ వెజ్ తింటుంటాం. ఆదివారమైతే.. ఇంటిల్లిపాది ఇంటివద్దే ఉంటారు కాబట్టి.. ఎంతో హ్యాపీగా వంటలు చేసుకుని.. కుటుంబమంతా కలిసి భోజనం చేస్తారు. సండే అంటే చికెన్, మటన్, ఫిష్ ఇలా.. చాలా రకాల నాన్ వెజ్ రకాలు ఉంటాయి. ప్రత్యేకంగా చేపల విషయానికొస్తే.. చెరువులలో పెంచిన చేపలకంటే.. సముద్రంలో సహజంగా దొరికే చేపల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కృత్రిమంగా పెంచిన చేపల్ని తినడం కంటే..
ఆదివారం వచ్చిందంటే.. నాన్ వెజ్ ప్రియులకు పండగే. వారంలో ఆది, బుధవారాల్లో ఎక్కువగా నాన్ వెజ్ తింటుంటాం. ఆదివారమైతే.. ఇంటిల్లిపాది ఇంటివద్దే ఉంటారు కాబట్టి.. ఎంతో హ్యాపీగా వంటలు చేసుకుని.. కుటుంబమంతా కలిసి భోజనం చేస్తారు. సండే అంటే చికెన్, మటన్, ఫిష్ ఇలా.. చాలా రకాల నాన్ వెజ్ రకాలు ఉంటాయి. ప్రత్యేకంగా చేపల విషయానికొస్తే.. చెరువులలో పెంచిన చేపలకంటే.. సముద్రంలో సహజంగా దొరికే చేపల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కృత్రిమంగా పెంచిన చేపల్ని తినడం కంటే.. సముద్రంలో లభించిన చేపల్ని తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ సముద్రపు చేపల్ని తింటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలు ఏంటో తెలుసుకుందాం.
ఆర్థరైటిస్ తగ్గుతుంది: సముద్రపు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ ను తగ్గిస్తాయి. అలాగే కీళ్లలో దృఢత్వం పెరిగి.. సులభంగా కదులుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు తరచూ సముద్రపు చేపల్ని తింటే.. త్వరగా కోలుకునే అవకాశాలున్నాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలంటే.. జింక్ అనే పోషక పదార్థం కూడా అవసరమవుతుంది. సముద్రపు చేపలతో పాటు పీతలు, రొయ్యలు, నత్తల్లోనూ జింక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్ ఎ, సెలీనియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి: ముద్రపు చేపల్లో పుష్కలంగా లభించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. వయస్సు పైబడిన తర్వాత కంటి చూపు క్రమంగా సన్నగిల్లుతుంటుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తరచూ సముద్రపు చేపలు తినాలి. రేచీకటి కూడా రాకుండా ఉంటుంది.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది: సముద్రపు చేపల్ని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిన్నారులు, యువతకు మెదడు చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయసు పైబడిన వారికి అల్జీమర్స్ కూడా రాకుండా ఉంటుంది.
గుండె జబ్బులు తగ్గుతాయి: వారానికి కనీసం ఒక్కసారైనా సముద్రపు చేపల్ని తింటే.. గుండెపోటుకు గురవ్వడం, తరచూ గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చర్మ సమస్యలు తగ్గుతాయి: సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో సముద్రపు చేపల్ని తింటే మొటిమలు తగ్గుతాయని నిరూపితమైంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి