AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reduce Cold Naturally: మందులు వాడకుండా.. జలుబును సహజంగా తగ్గించుకోండిలా!!

జలుబు.. ఇది కేవలం వర్షాకాలంలోనే కాదు. ప్రతి సీజన్ లోనూ సాధారణంగా ఉండే వ్యాధే. వేసవిలో శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల, వర్షాకాలంలో తడవడం, ఉన్నట్టుండి వాతావరణంలో మార్పుల వల్ల, శరీరంలో అధిక వేడివల్ల, శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల జలుబు వస్తుంది. దీనివెంటే .. జ్వరం, దగ్గు వంటివి క్యూ కడతాయి. జలుబుకి కూడా మందుబిళ్లలు మింగడం చాలామందికి ఇష్టం ఉండదు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో జలుబును..

Reduce Cold Naturally: మందులు వాడకుండా.. జలుబును సహజంగా తగ్గించుకోండిలా!!
Cold
Chinni Enni
|

Updated on: Aug 19, 2023 | 8:36 PM

Share

జలుబు.. ఇది కేవలం వర్షాకాలంలోనే కాదు. ప్రతి సీజన్ లోనూ సాధారణంగా ఉండే వ్యాధే. వేసవిలో శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల, వర్షాకాలంలో తడవడం, ఉన్నట్టుండి వాతావరణంలో మార్పుల వల్ల, శరీరంలో అధిక వేడివల్ల, శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల జలుబు వస్తుంది. దీనివెంటే .. జ్వరం, దగ్గు వంటివి క్యూ కడతాయి. జలుబుకి కూడా మందుబిళ్లలు మింగడం చాలామందికి ఇష్టం ఉండదు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో జలుబును తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

జీలకర్ర: జీలకర్ర వేయించి.. పొడి చేసి దానిని టీ స్పూన్ మోతాదులో తీసుకుని.. అదే మోతాదులో చక్కెర తీసుకుని.. రెండింటినీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే.. జలుబు తగ్గుతుంది.

వాము-పటికబెల్లం: అర టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ పటికబెల్లం కలిపి పొడిచేసి తినాలి. వెంటనే కొద్దిగా గోరువెచ్చని నీరు తాగాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే జలుబు నెమ్మదిగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

పాత్రలో కొద్దిగా వామువేసి.. దానిని దోరగా వేయించి.. పలుచటి క్లాత్ లో వేసి కట్టాలి. దానితో ముఖంపై కాపడం పెడితే.. శ్లేష్మం కరిగి జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

మిరియాలపొడి-బెల్లం: చిన్న బెల్లంముక్కను పొడిచేసి.. అందులో కొద్దిగా మిరియాలపొడిని కలపాలి. దానిని చిన్న ఉండలా చేసి..పూటకొకటి చొప్పున రెండు పూటలా గోరువెచ్చని నీటితో మింగితే.. జలుబు నుంచి రిలీఫ్ ఉంటుంది.

లవంగాలు-మిరియాలు: లవంగాలు లేదా మిరియాలను నీటిలో వేసి.. కొద్దిగా బెల్లం వేసి కాచుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకి రెండుసార్లు 60 ఎంఎల్ చొప్పున తాగితో జలుబుతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.

గులాబీ పువ్వుల రేకులు: గులాబీ పువ్వుల రేకులను నువ్వులనూనెలో వేసి అరగంట ఉంచి.. 5 నిమిషాలు వేడి చేయాలి. ఈ నూనెను వడగట్టి.. ఆ మిశ్రమాన్ని ముక్కు రంధ్రాల్లో 2 చుక్కల చొప్పున వేసుకుంటూ ఉంటే.. తుమ్ములు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు