AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine: మగవారి కంటే ఆడవారికే ఎందుకు మైగ్రేన్ ఎక్కువ వస్తుంది?

మైగ్రేన్ అంటే కుడి లేదా ఎడమవైపు తలనొప్పి రావడం. ఒక్కోసారి దీని కారణంగా.. తలలో నరాలు బలహీనపడి ఆలోచనాశక్తి తగ్గిపోతుంటుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ.. మైగ్రేన్ బాధితులున్నారు. కానీ పురుషుల్లో కంటే.. స్త్రీలలోనే మైగ్రేన్ తో బాధపడుతున్నవారు అధికంగా ఉంటున్నారు. అందుకు కారణం.. ఇంటి పని, ఆఫీస్ పని ఒత్తిడి, సమయానికి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. వాటికి తోడు ఎన్నో రకాల ఆలోచనలు, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం..

Migraine: మగవారి కంటే ఆడవారికే ఎందుకు మైగ్రేన్ ఎక్కువ వస్తుంది?
migraine
Chinni Enni
|

Updated on: Aug 18, 2023 | 8:18 PM

Share

సాధారణంగా తలనొప్పి వస్తేనే తట్టుకోలేం. వెంటనే దానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటాం. లేదంటే.. ఒక టీ లేదా కాఫీ తాగుతాం. నిజానికి టీ, కాఫీ ల వల్ల తలనొప్పి తగ్గదు. వాటిలో ఉండే కెఫీన్ కారణంగా మనం కొంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. తలనొప్పినే భరించలేం కదాం. మరి మైగ్రేన్ పెయిన్ వస్తే? అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కనీసం రోజువారి పనులు కూడా చేసుకోలేనంత అవస్థ పెడుతుంది మైగ్రేన్. శరీరంలో విటమిన్ B లోపం కారణంగా మైగ్రేన్ వస్తుంది.

మైగ్రేన్ అంటే కుడి లేదా ఎడమవైపు తలనొప్పి రావడం. ఒక్కోసారి దీని కారణంగా.. తలలో నరాలు బలహీనపడి ఆలోచనాశక్తి తగ్గిపోతుంటుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ.. మైగ్రేన్ బాధితులున్నారు. కానీ పురుషుల్లో కంటే.. స్త్రీలలోనే మైగ్రేన్ తో బాధపడుతున్నవారు అధికంగా ఉంటున్నారు. అందుకు కారణం.. ఇంటి పని, ఆఫీస్ పని ఒత్తిడి, సమయానికి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. వాటికి తోడు ఎన్నో రకాల ఆలోచనలు, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం కూడా మైగ్రేన్ కు కారణాలు. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మెదడుపై ఒత్తిడి పడకుండా.. మైగ్రేన్ కు గురికాకుండా ఉంటారు.

మన శరీరంలో మెటబాలిజం ప్రక్రియలో విటమిన్ B ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వుల నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం, ఆ శక్తిని శరీర అవయవాలు వినియోగించుకోవడానికి విటమిన్ B పనిచేస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, అలసట కారణంగా.. నరాల వ్యవస్థపై వాటి ప్రభావం పడి తరచూ తలనొప్పి వస్తుంది. క్రమంగా అది మైగ్రేన్ కు దారితీస్తుంది. ఒక్కోసారి ఇది పక్ష వాతానికి కూడా దారి తీయచ్చు. దీనిన స్పైనల్ కార్డ్ సబ్ అక్యూట్ కంబైన్డ్ డిజనరేషన్ అంటారు.

ఇవి కూడా చదవండి

విటమిన్ B లోపాన్ని నివారించగలిగితే.. మైగ్రేన్ నుండి విముక్తి పొందవచ్చు. థయామిన్ (విటమిన్ B1), రైబోఫ్లావిన్ (విటమిన్ B2) సరైన మోతాదులో శరీరానికి అందని పక్షంలో మైగ్రేన్ వస్తుంది. శరీరానికి విటమిన్ B1 అందాలంటే బఠానీ, హోల్ వీట్ బ్రెడ్, నట్స్ వంటివి ఆహారంగా తీసుకోవాలి. అలాగే విటమిన్ B కోసం పాలు, గుడ్లు, పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే లివర్, మష్రూమ్స్, మాంసం, చేపలు, తాజా అరటి పండ్లు, కమలా పండ్లలో థయామిన్ (విటమిన్ B1) ఎక్కువగా లభిస్తుంది. రైబోఫ్లావిన్ (విటమిన్ B2) పాలు, గుడ్లుతో పాటు.. పుట్టగొడుగుల్లో ఎక్కువగా లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి