AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reduce Back Pain Tips: ‘నడుము నొప్పి’ వేధిస్తోందా ? త్వరగా తగ్గాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!!

మూడు పదుల వయసైనా రాకుండానే.. నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల.. నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్ల చుట్టూ తిరిగినా.. ఎన్ని మందులు మింగినా.. దానికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. మందులతో నడుము నొప్పికి గుడ్ బై చెప్పలేం. మన జీవన విధానంలో కొన్నిమార్పులు చేసుకోవడం..

Reduce Back Pain Tips: 'నడుము నొప్పి' వేధిస్తోందా ? త్వరగా తగ్గాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!!
Back Pain
Chinni Enni
|

Updated on: Aug 18, 2023 | 8:00 PM

Share

మూడు పదుల వయసైనా రాకుండానే.. నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల.. నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్ల చుట్టూ తిరిగినా.. ఎన్ని మందులు మింగినా.. దానికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. మందులతో నడుము నొప్పికి గుడ్ బై చెప్పలేం. మన జీవన విధానంలో కొన్నిమార్పులు చేసుకోవడం ద్వారా నడుము నొప్పిని వదిలించుకోవచ్చు.

ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవడం:

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో.. చాలామంది గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చుండిపోతున్నారు. కనీస కదలికలు లేకుండా ఇలా కూర్చుని ఉండటం మీ ఆరోగ్యానికే హానికరం. కళ్లకు మానిటర్ కు మధ్య 20 అంగుళాల దూరం ఉండేలా.. కూర్చునే పొజిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా, పాదాలు పూర్తిగా నేలను తాకేలా కూర్చోవాలి. కుర్చీకి ఆనుకునే వీపు వంపు దగ్గర మెత్తని దిండు పెట్టుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి లేచి.. 5 నిమిషాల పాటు అటూ ఇటూ నడుస్తుండాలి.

ఇవి కూడా చదవండి

వ్యాయామాలు చేయాలి:

ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల కాళ్లు, చేతుల్లో కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. రక్తప్రసరణ సరిగ్గా అవ్వదు. కాబట్టి ఉదయం లేవగానే.. కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వాకింగ్, యోగా వంటివి రెగ్యులర్ గా చేయడం అలవాటు చేసుకోవాలి.

బైక్ డ్రైవ్ చేసేటప్పుడు నడుము నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కారు డ్రైవ్ చేసేటపుడు సీటులో నడుము వెనుక దిండును పెట్టుకోవాలి. ఎక్కువదూరం డ్రైవ్ చేయాల్సి ఉంటే.. మధ్యలో కొద్దిసేపు విరామం తీసుకుంటూ ఉండాలి.

నిద్రపోయే సమయంలో:

రాత్రి పడుకునే సమయంలో.. పరుపు మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకుండా బల్లపరుపుగా, సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మీకు బోర్లా పడుకునే అలవాటు ఉంటే.. ఆ అలవాటును తగ్గించుకోవాలి. పక్కకు తిరిగి పడుకున్నపుడు కాళ్ల మధ్యలో, వెల్లకిలా పడుకున్నపుడు మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి. పదేళ్లకు ఒకసారి పరుపును మార్చుకోవాలి.

అలాగే అధిక బరువులను ఒక్కసారిగా ఎత్తడం వల్ల నడుమునొప్పి రావడం, నడుము పట్టేయడం జరుగుతుంటాయి. బరువులు ఎత్తేటపుడు జాగ్రత్తగా ఉండాలి. పాదాలు పూర్తిగా నేలపై ఆనించి.. కడుపుని బిగించి బరువులను ఎత్తితే.. నడుమునొప్పి రాదు.

హ్యాండ్ బ్యాగ్ వల్ల మెడ, నడుం నొప్పి:

స్త్రీలు ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ ను వాడుతుంటారు. ఎక్కువగా దీనిని ఒకవైపునే తగిలించుకుంటు ఉంటారు. దీనివల్ల భుజాలు వంగిపోయి మెడ, నడునొప్పి వస్తాయి. అలా ఒకవైపునే కాకుండా.. తరచూ బ్యాగుని కుడి, ఎడమలకు మారుస్తూ ఉండాలి. లేదా బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ ను ట్రై చేయండి.

ఆహారంలో జాగ్రత్తలు:

మనం తినే ఆహారం కూడా నడుంనొప్పికి కారణం కావొచ్చు. కెఫీన్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. ఎక్కుగా పొట్టు ధాన్యాలు, సోయా, నట్స్, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

ఈ జాగ్రత్తలన్నీ పాటించినా.. నడుంనొప్పి తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించడం మంచిది. సమస్య తీవ్రతను బట్టి నడుంనొప్పికి సరైన చికిత్స తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి